PMGKAY: కడు పేదరికం వృద్ధికి ముకుతాడు.. కేంద్ర ఆహార భద్రత పథకానికి IMF ప్రశంసలు..

కరోనా మహమ్మారి ప్రతికూలతల మధ్యలోనూ భారత్‌లో కడు పేదరికం స్థాయి 2020లో 1% కంటే తక్కువగానే ఉన్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తన నివేదికలో వెల్లడించింది.

PMGKAY: కడు పేదరికం వృద్ధికి ముకుతాడు.. కేంద్ర ఆహార భద్రత పథకానికి IMF ప్రశంసలు..
PM ModiImage Credit source: TV9 Telugu
Follow us
Janardhan Veluru

|

Updated on: Apr 06, 2022 | 1:33 PM

దేశంలోని పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY)పై అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రశంసల జల్లు కురిపించింది. కరోనా కష్టకాలంలోనూ భారత్‌లో తీవ్ర పేదరికం స్థాయి పెరగకుండా ఈ పథకం ఎంతగానో దోహదపడుతున్నట్లు కొనియాడింది. కరోనా మహమ్మారి సంవత్సరాలలో భారతదేశంలో పేదరికం మరియు వినియోగ అసమానతలను అంచనా వేస్తూ IMF మంగళవారం ఒక నివేదికను విడుదల చేసింది.  కరోనా మహమ్మారి ముందు సంవత్సరం(2019)లో దేశంలో కడు పేదరికం 1 శాతం కంటే తక్కువగా(0.8శాతం) ఉన్నట్లు తెలిపింది. పాండమిక్ తర్వాత కూడా 2020లో భారత్‌లో కడు పేదరికం అదే స్థాయిలోనే ఉన్నట్లు తెలిపింది. కరోనా పాండమిక్ సంవత్సరం (2020)లో దేశంలో కడు పేదరికం స్థాయి పెరగకుండా నిరోధించడంలో PMGKAY పథకం కీలకమని IMF కొనియాడింది. కరోనా మహమ్మారి సంవత్సరంతో సహా వరుసగా రెండు సంవత్సరాలలో కడు పేదరికం స్థాయిని నియంత్రించడం..  తీవ్ర పేదరిక నిర్మూలనగానే పరిగణించవచ్చని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది.

కరోనా లాక్‌డౌన్ తర్వాత వలస కార్మికులు, పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (PMGKAY) పథకం ఆసరాగా నిలుస్తోంది. ఈ ఆహార భద్రత పథకం కింద ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్దిదారులందరికీ, నెలకు ఉచితంగా ఒక్కో వ్యక్తికి 5 కేజీల ఆహార ధాన్యాలను అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా 81 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేసింది. ఆత్మనిర్భర్ భారత్‌లో ఒక భాగమైన ఈ పథకంలో ఫేస్ 1, ఫేస్ 2లను ఏప్రిల్ 2020 నుంచి నవంబర్ 2020 వరకు అమలు చేయగా.. ఆ తర్వాత మూడో దశను మే నుంచి జూన్ 2021 వరకు నడిపింది. నాలుగో దశ జూలై నుంచి నవంబర్ 2021 వరకు ఆఫర్ చేసింది. ప్రస్తుతం ఐదో దశ పీఎంజీకేవై స్కీమ్ మార్చి 2022 వరకు కొనసాగింది. ఆరో విడతలో సెప్టెంబర్ 2022 వరకు దీన్ని పొడగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ పథకానికి అయ్యే ఖర్చును రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రమే భరిస్తోంది.

PMGKAY పథకం అత్యంత పేదరికాన్ని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషించింది: IMF

IMF నివేదిక మేరకు కడు పేదరిక నిర్మూలన విషయంలో భారత్ సానుకూల వృద్ధి సాధించానికి పలు అంశాలు కారణమయ్యాయి. అయితే ఇందులో పేదలకు ఆహార భద్రత కల్పిస్తున్న ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) పథకం కీలకంగా ఆ నివేదిక పేర్కొంది. అలాగే కోవిడ్ – 19 కారణంగా ఉపాధి కోల్పోయి  ఆర్థిక ఇక్కట్ల పాలైన పేదలు.. ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు ఈ పథకం గణనీయంగా పనిచేసిందని IMF నివేదిక పేర్కొంది.

Also Read..

Azim Premji: తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్న అజీమ్ ప్రేమ్‌జీ.. ప్రభుత్వ పనితీరుపై కితాబు..

Viral Video: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో తీవ్ర జాప్యం. నిరసన తెలుపుతూ 50 గంటల్లో 350 కిలోమీటర్లు పరుగెత్తిన యువకుడు