AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime news: ఏడేళ్ల చిన్నారిపై దారుణం.. అంత్యక్రియలు చేస్తుండగా అక్కడ రక్తం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు

మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, అత్యాచారాలు(Rape), హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లుమూసుకుపోయిన మృగాళ్లు చిన్నా పెద్దా అనే తేడా లేకండా విరుచుకుపడుతున్నారు. వారి కబంధ హస్తాల్లో చిక్కిన బాలికలు, చిన్నారులు మృత్యు ఒడికి చేరుతున్నారు. తాజాగా...

Crime news: ఏడేళ్ల చిన్నారిపై దారుణం.. అంత్యక్రియలు చేస్తుండగా అక్కడ రక్తం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు
crime news
Ganesh Mudavath
|

Updated on: Apr 06, 2022 | 3:23 PM

Share

మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, అత్యాచారాలు(Rape), హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లుమూసుకుపోయిన మృగాళ్లు చిన్నా పెద్దా అనే తేడా లేకండా విరుచుకుపడుతున్నారు. వారి కబంధ హస్తాల్లో చిక్కిన బాలికలు, చిన్నారులు మృత్యు ఒడికి చేరుతున్నారు. తాజాగా రాజస్థాన్(Rajasthan) లో ఇలాంటి ఘటనే జరిగింది. బంధువుల ఇంటికి వెళ్లిన ఏడేళ్ల బాలికపై ఆమె సమీప బంధువు హత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం మంచంపై పడేసి వెళ్లిపోయాడు. అనారోగ్యంతో చనిపోయిందని భావించిన తల్లిదండ్రులకు.. అంత్యక్రియలు చేస్తున్న సమయంలో ఊహించని విషయం తెలిసింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు(Complaint) చేశారు. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది. చిన్నారిని ఇంట్లో నిద్రపుచ్చి తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. ఆ సమయంలో వరసకు బంధువైన 35 ఏళ్ల వ్యక్తి నిద్రపోతున్న బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. చిన్నారికి రక్తస్రావం అవుతుండటంతో విషయం ఎవరికైనా చెబుతుందేమోనని భయపడ్డాడు. బాలిక గొంత నులిమి చంపేశాడు. అనంతరం ఇంటికి తీసుకెళ్లి మంచం మీద నిద్రపోతున్నట్లు చిత్రీకరించాడు.

తర్వాతి రోజు ఉదయం తల్లిదండ్రులు ఎంత లేపినా చిన్నారి లేవలేదు. దీంతో అనారోగ్యం కారణంగా చిన్నారి చనిపోయి ఉంటుందని భావించారు. అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో చిన్నారి మృతదేహంపై రక్తం మరకలు కనిపించడంతో తల్లి అప్రమత్తమైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించేందుకు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపేశారని పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలింది. పోలీసులు కేసు విచారించగా.. 35 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును రెండేళ్ల పాటు విచారించిన కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది.

Also Read

Suchitra Sen : చిత్ర సీమకు ఆరాధ్య నటి సుచిత్రాసేన్ … క్లాసిక్స్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఈ మహానటి

Brazilian Model: ఇప్పటికే 9 పెళ్లిళ్లు.. ఒక భార్యతో విడాకులు.. మరో ఇద్దరు భార్యలు కావాలంటున్న మోడల్

Navaratri 2022: నవరాత్రి రోజుల్లో ఏ రోజున ఈ రెండు శక్తి పీఠాల్లో దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందంటే..