Brazilian Model: ఇప్పటికే 9 పెళ్లిళ్లు.. ఒక భార్యతో విడాకులు.. మరో ఇద్దరు భార్యలు కావాలంటున్న మోడల్

Brazilian Model: ఆ దేశంలో బహుభార్యత్వం అమలులో ఉంది. అందుకే అతను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే తొమ్మది మంది భార్యల్లో ఒకరు ఇప్పుడు విడాకులు కోరుతుంది..

Brazilian Model: ఇప్పటికే 9 పెళ్లిళ్లు.. ఒక భార్యతో విడాకులు.. మరో ఇద్దరు భార్యలు కావాలంటున్న మోడల్
Brazilian Model Arthur O Ur
Follow us
Surya Kala

|

Updated on: Apr 06, 2022 | 12:24 PM

Brazilian Model: ఆ దేశంలో బహుభార్యత్వం అమలులో ఉంది. అందుకే అతను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే తొమ్మది మంది భార్యల్లో ఒకరు ఇప్పుడు విడాకులు కోరుతుంది. దీంతో తనకు మరో ఇద్దరు కొత్త భార్యలు కావాలని కోరుకుంటున్నాడు. దీనికి కూడా అతను ఓ రీజన్ చెబుతున్నాడు కూడా .. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్న సామెతను రోజు చేస్తూ బ్రెయిల్‌(Brazil) లోని సావోపాలోకి చెందిన మోడల్ ఆర్థర్ ఓ ఉర్సో (Arthur O Urso) తాను అందరిలో ప్రత్యేకమని భావిస్తాడు. అంతేకాదు ఒకరి ప్రేమించి.. ఆ ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుని జీవితాంతం వారితోనే గడపాలని అన్న మాటను తాను వ్యతిరేకమని చెబుతున్నాడు. అంతేకాదు ఎంతమందినైనా ప్రేమించండి.. వారిని పెళ్లి చేసుకోండి. అంటున్నాడు.. అంతేకాదు.. ప్రతి ఒక్క మగాడు.. తనని ఆదర్శంగా తీసుకుని చాలామంది స్త్రీలను ప్రేమించి పెళ్లి చేసుకోమని ఓ ఉచిత సలహా కూడా ఇస్తున్నాడు.. ఈ ప్రబుద్ధుడు. ఇప్పటికే తొమ్మిది మంది అమ్మాయిలను ఉర్సో పెళ్లి చేసుకున్నాడు. అయితే వారిలో ఒక స్త్రీ  ఉర్సో నుంచి  విడాకులు తీసుకుంటుంది. దీంతో తన భార్యల సంఖ్యను 10కి పెంచుకోవాలని కోరుకుంటున్నాడు. దీంతో తాను మరో ఇద్దరు మహిళలను వివాహం చేసుకోవాలని యోచిస్తున్నాడు. అంతేకాదు ఆ పదిమంది భార్యల సంతానానికి తండ్రి కావాలని కోరుకుంటున్నట్లు తాజాగా చెప్పాడు.

ది బేర్ (The bear)గా ఫ్యాన్స్ పిలుచుకునే ఉర్సో 2021లో 28 కేజీల బరువు తగ్గాడు.. మొదటి భార్య పేరు లువానా కజాకీ ఆమె బ్లాగర్. ఆమెను మొదట పెళ్లి చేసుకున్నాడు. అయితే మిగతా ఎనిమిది మందితో పాటు.. మళ్ళీ మొదటి భార్యను కూడా పెళ్లి చేసుకున్నాడు. దీంతో తొమ్మిది మంది భార్యలను ఒకేసారి.. వివాహం చేసుకుని వార్తల్లో నిలిచాడు. సావో పాలోలోని క్యాథలిక్ చర్చిలో 2021 నవంబర్ లో ఈ వివాహ వేడుక జరిగింది. అప్పట్లో ఉర్సో పెళ్లిళ్లపై తీవ్ర విమర్శలు కూడా ఎదురయ్యాయి.

అయితే తొమ్మిది మంది భార్యళ్ళూ ఒక అమ్మాయి అగాథా తనకు ఇలా తొమ్మిది మంది భార్యల్లో ఒకరిగా ఉండడం ఇష్టం లేదని.. విడాకులు కోరుతుంది. తన భర్త తనతో మాత్రమే ఉండాలని.. మరికొందరి అమ్మాయిలతో తాను పంచుకోవడానికి రెడీగా లేనని.. అందుకనే తనకు విడాకులు ఇప్పించడమని అడుగుతుంది. అంతేకాదు ఇలా ఓ భర్తను కొంతమంది పంచుకోవడానికి అతను ఏమైనా తినే ఆహారమా అంటూ ప్రశ్నిస్తుంది. నా భర్త నాకే సొంతం కావాలంటుంది.

అయితే అగాథా కోరికకు .. విడాకుల కోసం చెబుతున్న రీజన్ కు భర్త ఉర్సో మిగతా 8 మంది భార్యలూ తప్పు పడుతున్నారు. అంతేకాదు ఇప్పుడు ఉర్సో… మరో ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుని తన భార్యల సంఖ్య 10కి చేర్చుకోవాలని ఆలోచిస్తున్నాడు. అంతేకాదు తనకు 10 మంది భార్యలుండాలనేది కల.. అంతేకాదు ఆ భార్యలందరికి తలో పిల్ల ఉండాలని కూడా కోరుకుంటున్నాడు. ఇప్పటికే ఓ కూతురు కూడా ఉంది. తాను తన భార్యలను అందరిని ఒకేలా ప్రేమిస్తానని.. ఒకేలా చూస్తానని చెప్పాడు.

Also Read: Physical Shares: పాత ఫిజికల్ షేర్లను ఎలా మార్చుకోవాలి..? వాటిలో సొమ్మును ఇలా తీసుకోవచ్చని మీకు తెలుసా..!

Andhra Pradesh: పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలి సవాల్ విసిరిన మంత్రి బాలినేని