Viral Video: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో తీవ్ర జాప్యం. నిరసన తెలుపుతూ 50 గంటల్లో 350 కిలోమీటర్లు పరుగెత్తిన యువకుడు

Viral Video: నేటి యువతలో ఎక్కువమంది ఇంజనీరింగ్,  డాక్టర్లు కావాలని అనుకుంటారు.. వారి తల్లిదండ్రుల అభిలాష కూడా అదే అని అందరూ భావిస్తున్నారు. అయితే.. దేశసేవ చేయడానికి  తాము ఆర్మీ(Indin Army) లో చేరడమే..

Viral Video: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో తీవ్ర జాప్యం. నిరసన తెలుపుతూ 50 గంటల్లో 350 కిలోమీటర్లు పరుగెత్తిన యువకుడు
Rajasthan Youth Ran 350 Kms
Follow us
Surya Kala

|

Updated on: Apr 06, 2022 | 1:20 PM

Viral Video: నేటి యువతలో ఎక్కువమంది ఇంజనీరింగ్,  డాక్టర్లు కావాలని అనుకుంటారు.. వారి తల్లిదండ్రుల అభిలాష కూడా అదే అని అందరూ భావిస్తున్నారు. అయితే.. దేశసేవ చేయడానికి  తాము ఆర్మీ(Indin Army) లో చేరడమే లక్ష్యంగా చదువులు  చదువుతామని .. తన లక్ష్య సాధన కోసం రోడ్డుమీద పరుగెడుతూ ఇటీవలే ప్రదీప్ అనే యువకుడు సోషల్ మీడియా(Social Midea) లో నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నాడు. అయితే ఇప్పుడు మరో యువకుడు.. ఆర్మీల చేరడం తన లక్ష్యమని.. అయితే ఆర్మీలో రిక్రూట్‌మెంట్(Army Recruitment) ప్రక్రియలో జాప్యాన్ని  వ్యతిరేకిస్తూ.. సురేష్ భిచార్ రాజస్థాన్‌లోని సికార్ నుంచి ఢిల్లీ వరకు 50 గంటల్లో పరుగెత్తాడు.  వివరాల్లోకి వెళ్తే..

అతడి లక్ష్యం ఆర్మీలో చేరటమే. అతనికే కాదు అతడు నివసిస్తున్న ప్రాంతంలో చాలా మంది సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని అనుకుంటారు. కానీ, కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా రిక్రూట్‌మెంట్ లేదు. దీంతో దేశంలో చాలామంది యువతలో ఆర్మీలో చేరాలనే ఆసక్తి తగ్గిపోతుంది. కొందరికి వయో పరిమితి దాటిపోవడంతో ఆర్మీల చేరడానికి వీలుపడడడం లేదు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన సురేష్ భిచార్ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు . రాజస్థాన్‌ నుంచి ఢిల్లీ వరకు మారథాన్‌ నిర్వహించాడు. ఈ క్రమంలో అతడిని మీడియా పలకరించింది. ఈ సందర్భంగా రాజస్థాన్ నాగౌర్‌ జిల్లా సికర్‌కు చెందిన 24 ఏళ్ల సురేష్ భిచార్‌ భారత సైన్యంలో చేరడమే తన ఆశయమని, తనకే కాదు తమ ప్రాంతంలో అనేక మంది ఆర్మీలో చేరాలనే లక్ష్యం పెట్టుకుని రిక్రూట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపాడు. ఈ క్రమంలో కొందరికి వయసు దాటిపోతుండటంతో మిగతా వారికి ఆర్మీలో చేరాలనే ఆసక్తి తగ్గిపోతుందని, ఈ నేపథ్యంలో వారిని వారిని ప్రోత్సహించేందుకు సురేశ్ భిచార్ సికర్‌ నుంచి ఢిల్లీ వరకు మారథాన్ చేపట్టినట్టు చెప్పాడు. ఈ క్రమంలో 50 గంటల్లో 350 కిలో మీటర్లు పరుగెత్తాడు. ప్రస్తుతం ఇతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నివేదిక ప్రకారం.. సురేష్ ఆర్మీలో చేరడానికి ఇప్పుడు వయో పరిమితిని దాటిపోయాడు. ఇకపై భారత సైన్యంలో చేరడానికి అర్హత లేదు. జవానుగా దేశానికి సేవ చేయాలన్నది తన కల అని.. అయితే అది కుదరలేదని చెప్పాడు. అయితే తాను ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీ (టీఏ)లో చేరాలనే లక్ష్యంతో కసరత్తు ప్రారంభించినట్లు సురేష్‌ చెప్పాడు.

Also Read: Viral Video: ఓ రేంజ్‌లో సైకిల్ తొక్కుతున్న ఓ కాలు లేని వృద్ధుడు.\

Brazilian Model: ఇప్పటికే 9 పెళ్లిళ్లు.. ఒక భార్యతో విడాకులు.. మరో ఇద్దరు భార్యలు కావాలంటున్న మోడల్