Telangana: హత్య చేసేందుకే వచ్చారంటున్న సర్పంచ్ భర్త.. అమీన్ పూర్‌ తుపాకీ హల్చల్ ఘటనలో కొత్త ట్విస్ట్

Sangareddy Districr: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపూర్ తండాలో తుపాకీ హల్చల్ ఘటన మరో మలుపు తిరిగింది.. తనను చంపేందుకు వచ్చారని సర్పంచ్ భర్త రవి నాయక్ ఆరోపిస్తుంటే..

Telangana: హత్య చేసేందుకే వచ్చారంటున్న సర్పంచ్ భర్త.. అమీన్ పూర్‌ తుపాకీ హల్చల్ ఘటనలో కొత్త ట్విస్ట్
Ameenpur Gun Hulchal
Follow us

|

Updated on: Apr 06, 2022 | 4:13 PM

Sangareddy Districr: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపూర్ తండాలో తుపాకీ హల్చల్ ఘటన మరో మలుపు తిరిగింది. తనను చంపేందుకు వచ్చారని సర్పంచ్ భర్త రవి నాయక్ ఆరోపిస్తుంటే.. తమ పొలాన్ని పరిశీలించేందుకు వెళ్తే తమపై దాడి చేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ భర్త రవి భూములు కబ్జా చేశారనీ.. వాటిని కాపాడుకునేందుకు వెళ్తే..తమపై దాడి చేశారని వారు చెప్పుకొస్తున్నారు. తమ పొలం వివాదంలో ఉందనీ.. దానిని ఫోటోలు తీసుకుని కోర్టులో సబ్మిట్ చేద్దామని వెళ్తే దాడి చేశారని బాధితులు జావెద్, వాజీద్ ఆరోపిస్తున్నారు. గ్రామస్తుల దాడిలో వారిద్దరూ తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు.

ఐలాపూర్ తండా పరిసరాల్లో జావెద్, వాజీద్ ఇనే ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని గ్రామస్తులు పట్టుకుని నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. పైగా వారి దగ్గర తుపాకీ, బుల్లెట్లు ఉండటంతో స్థానికులు చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. వారి నుంచి తుపాకీ, బుల్లెట్లతో పాటు సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నారు అమీన్ పూర్ పోలీసులు. స్థానికుల చేతిలో గాయపడిన వారు బంజారాహిల్స్ కు చెందిన మొహమ్మద్ జావిద్ (30),  చంద్రాయణ గుట్టకు చెందిన మొహమ్మద్ వాజీద్(32)గా పోలీసులు గుర్తించారు. తమ వద్దనున్న గన్ కు లైసెన్స్ ఉందంటూ జావిద్ చెప్పగా.. ఆరా తీసిన పోలీసులు గన్‌కు లైసెన్స్ ఉన్నట్లు నిర్ధారించారు. స్థానిక ఎమ్మెల్యే సూచన మేరకు భూములు చూడ్డానికి వచ్చామని బాధితులు చెబుతున్నారు.

అయితే వాళ్లు వచ్చింది తనను చంపేందుకే అంటూ సర్పంచ్ భర్త విస్లావత్ రవి ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఘటనలో ఎమ్మెల్యే ప్రమేయం ఏ మాత్రం లేదని పఠాన్ చెరు డీఎస్పీ బీమ్ రెడ్డి చెప్పారు. జావెద్, వాజీద్‌పై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

గన్ కు లైసెన్స్ ఉన్నా పబ్లిక్ లో ప్రదర్శించి ప్రజలను భయాందోళనకు గురిచేయడం నేరమే అవుతుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read..

Purandareshwari: బీజేపీ – జనసేన పొత్తుపై పురంధరేశ్వరి కీలక వ్యాఖ్యలు.. వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు

Telangana University: తెలంగాణ యూనివర్సిటీ క్యాంటిన్ టిఫిన్‌లో కప్ప.. విద్యార్థుల ఆందోళన.