Purandareshwari: బీజేపీ – జనసేన పొత్తుపై పురంధరేశ్వరి కీలక వ్యాఖ్యలు.. వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు
ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ సర్వనాశనం అవుతున్నయాని బీజేపీ(BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. విజయవాడ(vijayawada) లోని పార్టీ కార్యాలయంలో ఆవిర్బావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ-...
ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ సర్వనాశనం అవుతున్నయాని బీజేపీ(BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. విజయవాడ(vijayawada) లోని పార్టీ కార్యాలయంలో ఆవిర్బావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ-జనసేన పొత్తుపై పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. మిత్ర పక్షంగా పవన్ కళ్యాణ్ మాతో చర్చిస్తే.. మేము కూడా స్పందిస్తాం. ఏపీలో కార్యక్రమాలు వేరైనా.. బీజేపీ-జనసేన(Janasena) పొత్తు కొనసాగుతుందన్నారు. విశాఖ ఉక్కు విషయంలో వైసీపీ నాయకులకు బీజేపీని తప్పుపట్టే అర్హత లేదని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. అధికారంలోకి రావటమే వైసీపీ లక్ష్యమన్న పురంధరేశ్వరి.. అధికార దాహంతో వారు చేసే పనులు ఏవిధంగా ఉంటాయో చూస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పురంధరేశ్వరి వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ వంతు బాధ్యతగా ధరలను తగ్గించిందని రాష్ట్ర ప్రభుత్వం పన్నుల విషయంలో ఎందుకు తగ్గించటం లేదని ప్రశ్నించారు.
ప్రతి బీజేపీ కార్యకర్త దేశ సేవకు పునరంకితం కావాలి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల పెట్రోల్ రేట్లు పెరిగాయి. ఇటీవల జరిగిన ఎన్నికలలో నాలుగు రాష్ట్రాలలో బీజేపీకి పట్టం కట్టారు. బీజేపీ పాలనపై ప్రజలు నమ్మకంతో ఉన్నారు. పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త పని చేయాలి. దేశంలో పేదల అభ్యున్నతికి ప్రధాని నరేంద్రమోడీ ఎంతగానో కృషి చేస్తున్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రకాష్ సూత్రంతో పార్టీ ముందుకు వెళుతోంది.
– దగ్గుబాటి పురంధరేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
Also Read
K.G.F: Chapter 2: కేజీఎఫ్ ఛాప్టర్ 2 నుంచి మరో పాట.. ఆకట్టుకుంటున్న ‘ఎదగరా’ సాంగ్
Nandyala: చిన్న కాకి, పెద్ద నష్టం మిగిల్చింది.. ఆ కథా కమామిషు మీ కోసం…
ELSS Investment: పన్ను ఆదాకోసం ELSS పెట్టుబడులు సరైన నిర్ణయమేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..