Andhra Pradesh: పెట్టుబడుల స్వర్గధామంగా ఏపీ.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానం..
Ease of Doing Business: కరోనా సంక్షోభంతో దేశం కొట్టుమిట్టాడుతోన్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బాగా పెరిగాయి.
Ease of Doing Business: కరోనా సంక్షోభంతో దేశం కొట్టుమిట్టాడుతోన్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బాగా పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఏపీలోనే ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. అందుకు నిదర్శనమే ఇన్వెస్ట్ ఇండియా తాజాగా వెలువరించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఏకంగా అగ్రస్థానంలో నిలిచింది. 2019 అక్టోబర్ నుంచి 2021 డిసెంబర్ వరకు రాష్ట్రంలో 451 అమెరికన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ఏపీకి వచ్చాయిని ‘ది నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలియేషన్ ఏజెన్సీ ఆఫ్ ది గవర్నమెట్ ఆఫ్ ఇండియా (Invest India)’ పేర్కొంది. రాష్ట్రంలో 974 కి.మీ. మేర దేశంలో రెండో పొడవైన తీర ప్రాంతం ఉండడం, రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు పుష్కలంగా ఉండడం పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని ఇన్వెస్ట్ ఇండియా తెలిపింది.
పుష్కలంగా పారిశ్రామిక వనరులు..
‘ఆంధ్రప్రదేశ్‌లో 6 ఓడరేవులు, 6 విమానాశ్రయాలు, 123,000 కి.మీ రహదారులు, 2,600 కి.మీ రైలు నెట్‌వర్క్ ఉండడం, 24 గంటలపాటు విద్యుత్ సరఫరా ఉన్నందున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేగాక రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఉండడం పాటు కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలతో నీటి వనరులు సమృద్ధిగా ఉండడంతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి పుష్కలమైన వనరులు ఉన్నాయి. ఇక 2018-19 నాటికి ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఇది కూడా ఒక కారణం ‘ అని ఇన్వెస్ట్ ఇండియా పేర్కొంది.
#StateFocus#DidYouKnow: Andhra Pradesh ranks #1 in ease of doing business in India!
Learn more about opportunities in the state here: https://t.co/QiUzSJxMPl#InvestInIndia #InvestIndia @AP_EDB @Industries_GoAP @AndhraPradeshCM pic.twitter.com/JNPeLo3uob
— Invest India (@investindia) April 6, 2022
Also Read:TET Paper-1: బీఈడీ అభ్యర్థులకు గమనిక.. మార్పులు చేసుకుంటూ చదివితే మంచి స్కోర్ మీదే
Telangana University: తెలంగాణ యూనివర్సిటీ క్యాంటిన్ టిఫిన్‌లో కప్ప.. విద్యార్థుల ఆందోళన.