ELSS Investment: పన్ను ఆదాకోసం ELSS పెట్టుబడులు సరైన నిర్ణయమేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..

ELSS Investment: ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో ఇతర వ్యక్తులు గందరగోళానికి గురవుతుంటారు. టాక్స్ సేవ్ చేసుకునేందుకు ELSS పెట్టుబడులు అసలు ఉత్తమమైన ఎంపికేనా. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

ELSS Investment: పన్ను ఆదాకోసం ELSS పెట్టుబడులు సరైన నిర్ణయమేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..
Elss Investments
Follow us

|

Updated on: Apr 06, 2022 | 12:05 PM

ELSS Investment: ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో ఇతర వ్యక్తుల మాదిరిగానే రవీందర్ కూడా టెన్షన్‌కు గురవుతున్నాడు. సంవత్సరం మెుత్తంలో ఈ సమయం అతనికి నిజంగా గందరగోళంగా ఉంది. ఆఫీస్ లో టాక్స్ సేవింగ్స్(Tax saving) ప్రయోజనాల కోసం ఇన్వెస్ట్ మెంట్ రుజువులు సమర్పించాల్సి రావటమే ఇందుకు కారణం. ఇప్పుడు రవీందర్ ను వేధిస్తున్న ప్రశ్న ఏమిటంటే అసలు పన్ను ఆదా చేయటం ఎలా అన్నదే.. చాలా మంది ఉద్యోగుల మాదిరిగానే అతను కూడా అనేక పథకాల్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. అయితే ఇది సరైన వ్యూహమైనా అన్నది అసలు ప్రశ్న. ఒక టాక్స్ నిపుణుడు(Tax Experts) ELSSలో కొంత డబ్బును పెట్టుబడిగా పెట్టమని రవీందర్ కు సలహా ఇచ్చాడు. ఇది మంచి రాబడిని ఇవ్వటంతో పాటు పన్ను ఆదా చేయడంలో సహాయపడుతుందని సూచించాడు. దీంతో రవీందర్ వెంటనే 1.5 లక్షల రూపాయలను ELSS స్కీమ్ లో పెట్టుబడి పెట్టాడు. ఇది రవీందర్‌కి బాగా నచ్చింది. పైగా ఈ పెట్టుబడి వల్ల అతని ఇన్వెస్ట్ మెంట్ కు 12-15 శాతం రాబడి కూడా వస్తుంది. దీంతో రవీందర్ చాలా సంతోషించాడు. కానీ.. పన్ను ఆదా అనేది ఏటా చేయాల్సి రావటం అతనికి ఇబ్బందిగా మారింది. కాబట్టి అతను ప్రతి సంవత్సరం ELSS లో పెట్టుబడి పెట్టాలా అని ఆలోచిస్తున్నాడు. ఇలా చేయటం వల్ల అతను చాలా సొమ్మును ELSS స్కీమ్లలో పెట్టుబడి రూపంలో కొనసాగించాల్సి వస్తుందని రవీందర్ గ్రహించాడు. ఇందుకు సరైన పెట్టుబడి వ్యూహం ఏమిటా అని అతను ఆలోచనలో పడ్డాడు.

టాక్స్ సేవింగ్స్ ఓకే.. పోర్ట్‌ఫోలియోలో బ్యాలెన్స్ జాగ్రత్త..

ఇలా పెట్టుబడి విషయంలో డైలమాలో ఉన్న వారు మెుదటగా మనం టాక్స్ సేవింగ్ గురించి తెలుసుకోవాలి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అనేది మ్యూచువల్ ఫండ్స్ లో పన్ను రాయితీ అందిస్తున్న ఏకైక ప్లాన్. ఆదాయపన్నులోని సెక్షన్-80C కింద ఇన్వెస్టర్లకు పన్ను ఆదా ప్రయోజనం లభిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. మీరు అసలు గరిష్ఠంగా ఆదా చేయగల పన్ను ఎంత అన్నదే. సంవత్సరానికి ఒక వ్యక్తి గరిష్ఠంగా 1.5 లక్షల రూపాయల వరకు టాక్స్ ఆదా చేయవచ్చు.

ఇప్పుడు రవీందర్ మదిలో ఉన్న అనుమానం ఏమిటంటే.. ELSS పెట్టుబడుల వల్ల టాక్స్ ఆదాతో పాటు మంచి ఆదాయం వస్తోంది కానీ.. వాటిలో రిస్క్ ఎలా ఉంటుందనేదే. దీనికి సమాధానం ఏమిటంటే.. మీరు పన్ను ఆదా ప్రయోజనాల కోసం ELSSలో ఎంత డబ్బునైనా పెట్టుబడిగా పెట్టవచ్చు. చాలా మ్యూచువల్ ఫండ్స్ వద్ద ELSS లోడ్‌ ఉన్నాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, కానీ.. ప్రజలు పెట్టుబడిలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ ను పరిగణలోకి తీసుకోవటం లేదు. అందువల్ల అక్కడ సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి, మీరు పన్ను ఆదా చేయవచ్చు.. కానీ అదే సమయంలో రాబడిపై ప్రభావం చూపవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రవీందర్ పోర్ట్‌ఫోలియోలో అదే వర్గానికి చెందిన చాలా ELSSలు ఉండవచ్చు. ఇది మొత్తం పోర్ట్‌ఫోలియోలో బ్యాలెన్స్ తప్పే ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ELSSలో పెట్టుబడి పెట్టేటప్పుడు మీ పోర్ట్‌ఫోలియో బ్యాలెన్స్ డ్ గా ఉందో లేదో కూడా గమనించండి.

లాక్ -ఇన్ పిరయడ్ తర్వాత ఏమి చేయాలి..

మీకు వాటి నుంచి ఎంత రాబడి వస్తుందనే దాని గురించి మీరు తెలుసుకోవచ్చు. మీరు ఒకే సమయంలో చాలా ELSS లో పెట్టుబడి పెట్టినట్లయితే.. అది ప్రయోజనకరంగా ఉండదని తెలుసుకోండి.మరో విషయం ఏమిటంటే.. 3 సంవత్సరాల లాక్-ఇన్ పిరియడ్ ముగిసిన తర్వాత మంచి పనితీరు కనబరచని ELSS స్కీమ్ నుంచి మీ డబ్బును తీసివేయండి. ఈ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలా అని రవీందర్ ఆలోచిస్తున్నాడు. దీనికి సమాధానం ఏమిటంటే.. అతను మంచి ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ లార్జ్ క్యాప్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఏకమొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టే బదులు.. SIP రూపంలో పెట్టుబడి పెట్టండి. దీని కారణంగా మీరు ఒకేసారి భారీ భారాన్ని ఎదుర్కోవలసిన అవసరం ఉండదు. దీనివల్ల కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ELSS ఫండ్ బాగా పనిచేస్తుంటే.. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయటం కొనసాగించివచ్చని MyWealthGrowth.com కో-ఫౌండర్ హర్షద్ చేతన్‌వాలా రవీందర్‌కి సూచిస్తున్నారు. పోర్ట్‌ఫోలియోలోని ఇతర ఈక్విటీ ఫండ్‌ల మాదిరిగానే దీనిని పరిగణించవచ్చని పేర్కొన్నారు.

సూచనలు.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్- 80C కింద టాక్స్ ఆదా ప్రయోజనాలను పొందేందుకు రవీందర్ వంటి పెట్టుబడిదారులు కేవలం ఒకటి లేదా 2 ELSS స్కీమ్లలో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ELSS ఫండ్ అనేది షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులకు లాంగ్ టర్మ్ వ్యూలో నుంచి మంచి పెట్టుబడి నిర్ణయం.., అదే సమయంలో పన్నును కూడా ఆదా చేస్తుంది. మీకు ELSSలో చాలా ఎంపికలు ఉంటాయి. ఆర్థిక ప్రణాళిక ప్రకారం తగిన ఫండ్‌ను ఎంచుకోండి.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Physical Shares: పాత ఫిజికల్ షేర్లను ఎలా మార్చుకోవాలి..? వాటిలో సొమ్మును ఇలా తీసుకోవచ్చని మీకు తెలుసా..!

Market News: వరుస నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్న భారత స్టాక్ మార్కెట్లు.. మదుపరులను వెంటాడుతున్న భయాలు..

Latest Articles