K.G.F: Chapter 2: కేజీఎఫ్ ఛాప్టర్ 2 నుంచి మరో పాట.. ఆకట్టుకుంటున్న ‘ఎదగరా’ సాంగ్

నిన్నటివరకు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అంతా ఆసక్తిగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎదురుచూశారు. అందరు ఊహించినట్టే ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీ హిట్ ను అందుకుంది.

K.G.F: Chapter 2: కేజీఎఫ్ ఛాప్టర్ 2 నుంచి మరో పాట.. ఆకట్టుకుంటున్న 'ఎదగరా' సాంగ్
Kgf 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 06, 2022 | 4:18 PM

నిన్నటివరకు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అంతా ఆసక్తిగా ఆర్ఆర్ఆర్(RRR) సినిమా కోసం ఎదురుచూశారు. అందరు ఊహించినట్టే ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీ హిట్ ను అందుకుంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు దర్శక ధీరుడు. ఇక ఇప్పుడు మరో సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అదే కేజీఎఫ్ 2(K.G.F: Chapter 2). కేజీఎఫ్ మొదటి పార్ట్ సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన కేజీఎఫ్ సినిమా విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో కన్నడ స్టార్ హీరో యశ్ అన్ని భాషల్లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతుంది. భారీ క్రేజీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. కేజీఎఫ్ ఛాప్టర్1  పాన్ ఇండియా రేంజ్ బాక్సాఫీస్ దగ్గ‌ర క్రియేట్ చేసిన సెన్సేష‌న్‌ను ఇప్పుడే ఎవ‌రూ మ‌ర‌చిపోలేం.

ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన తుఫాన్ పాట, ట్రైలర్ సంచలన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. కేజీఎఫ్ మొదటి పార్ట్ కు మించి ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. తాజాగా ఈ సినిమానుంచి మరో పాటను విడుదల చేశారు చిత్రయూనిట్. కేజీఎఫ్ 2 నుంచి ఎదగర అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అమ్మ ప్రేమకు అద్దం పట్టేలా ఈ పాట సాగింది. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను సుచేత బస్రూర్ ఆలపించారు. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ తో సెకండ్ పార్ట్‌పై భారీ హైప్స్ క్రియేట్ అయ్యాయి. ఆ అంచ‌నాల‌ను మించేలా భారీ బ‌డ్జెట్‌, స్టార్ క్యాస్టింగ్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాను రూపొందించారు మేక‌ర్స్‌. కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే హోంబ‌లే ఫిలింస్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akkineni Naga Chaitanya: స్పీడ్ పెంచిన నాగచైతన్య.. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతూ..

Aamna Sharif: డిఫరెంట్ ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న ఆమ్నా షరీఫ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Ram Charan: అయ్యప్ప దీక్షలో అమృత సర్‌లో ల్యాండ్ అయిన రామ్ చరణ్.. నెక్స్ట్ సినిమా షూటింగ్‌తో బిజిబిజీ

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!