Satyadev : నిర్మాతగా అవతారమెత్తిన వర్సటైల్ యాక్టర్.. ‘ఫుల్ బాటిల్’ ఎతేస్తానంటున్న సత్యదేవ్..
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు హీరో సత్యదేవ్(Satyadev ). క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలు పెట్టిన సత్యదేవ్
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు హీరో సత్యదేవ్(Satyadev ). క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలు పెట్టిన సత్యదేవ్ ఆ తర్వాత హీరోగా మారాడు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన జోతిలక్ష్మి సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు సత్య దేవ్. ఆతర్వాత హీరోగా వరుస అవకాశాలను అందుకున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు సత్యదేవ్. తాజాగా ఈ యంగ్ హీరో నిర్మాతగా అవతారమెత్తాడు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసి సినిమాలు నిర్మించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. సత్యదేవ్ ‘SD కంపెనీ’ అనే ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించి ప్రొడక్షన్ నెంబర్ 1 ను అనౌన్స్ చేశాడు. సత్యదేవ్ స్వీయ నిర్మాణంలో ”ఫుల్ బాటిల్” అనే సినిమా తెరకెక్కుతోంది. బుధవారం ఈ సినిమా పూజాకార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.
ఫుల్ బాటిల్ సినిమాకు శరణ్ కొప్పిశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో 78.1 శాతం కామెడీ.. 21.9% యాక్షన్ ఉంటుందని సత్యదేవ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈపోస్టర్ లో ఆటోలో డ్రైవింగ్ సీట్ లో అబ్బాయి.. బ్యాక్ సీట్ లో అమ్మాయి కూర్చొని ఉండగా.. ఆటో పైన ఒక మందు సీసాలో ”ఫుల్ బాటిల్” టైటిల్ డిజైన్ చేసి కనిపించింది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సత్యదేవ్ తాగుబోతుగా కనిపించనున్నాడు. శర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ లో రామాంజనేయులు జవ్వాజి తో కలిసి సత్యదేవ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో సత్యదేవ్ నిర్మాతగా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి. ఇక సత్యదేవ్ నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది.
Let’s fly to the never ending funny land
Coming to Intoxicate you with #FullBottle ?of Entertainment
Versatile D̶r̶u̶n̶k̶e̶r̶ Actor @ActorSatyaDev with @sharandirects ?
@SDCompanyOffl @SRCOffl @vamsikaka pic.twitter.com/YB4S8Ze8hu
— BA Raju’s Team (@baraju_SuperHit) April 6, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :