AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: అయ్యప్ప దీక్షలో అమృత సర్‌లో ల్యాండ్ అయిన రామ్ చరణ్.. నెక్స్ట్ సినిమా షూటింగ్‌తో బిజిబిజీ

Ram Charan: దక్షిణాది సూపర్ స్టార్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వరస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఇటీవల రిలీజైన 'ఆర్ఆర్ఆర్' (RRR) మూవీ బాక్సాఫీస్(Box Office) వద్ద సందడి చేస్తుండగా.. నెక్స్ట్ తండ్రి..

Ram Charan: అయ్యప్ప దీక్షలో అమృత సర్‌లో ల్యాండ్ అయిన రామ్ చరణ్.. నెక్స్ట్ సినిమా షూటింగ్‌తో బిజిబిజీ
Ram Charan At Amritsar
Surya Kala
|

Updated on: Apr 06, 2022 | 11:15 AM

Share

Ram Charan: దక్షిణాది సూపర్ స్టార్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వరస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఇటీవల రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీ బాక్సాఫీస్(Box Office) వద్ద సందడి చేస్తుండగా.. నెక్స్ట్ తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే చరణ్ తన నెక్స్ట్ మూవీ RC15 షూటింగ్ లో పాల్గొనడానికి పంజాబ్ లోని  అమృత్‌సర్‌లో అడుగుపెట్టాడు . అయితే కొన్ని రోజుల వ్యవధిలో రామ్ చరణ్ పంజాబ్‌లో ఇది రెండవ సారి పర్యటించడం విశేషం. ఇటీవల RRR విడుదలకు ముందు గోల్డెన్ టెంపుల్‌ని రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కలిసి అమృత్ సర్ ను దర్శించారు.

తాజాగా రామ్ చరణ్ ,శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న RC15 షూటింగ్ లో పాల్గొనడానికి రామ్ చరణ్ అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాడు. రామ్ చరణ్ తనతో పాటు తన పెంపుడు కుక్క రైమ్‌ని కూడా అమృత్‌సర్‌కి తీసుకెళ్లాడు.ఈ సందర్భంగా చరణ్ చెప్పులు లేకుండా, నలుపు రంగు దుస్తులు ధరించి చూపరులను ఆశ్చర్యపరిచాడు. రామ్ చరణ్  రెండు రోజుల క్రితం ముంబైలో చెప్పులు లేకుండా కనిపించాడు. అప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేశాయి.  చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు , తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో చెర్రీకి జోడిగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటిస్తుంది.

ఇక దక్షిణ భారత సంప్రదాయాన్ని అనుసరిస్తూ చరణ్ అయ్యప్ప దీక్షను తీసుకున్నాడు. గత్య కొన్నేళ్లుగా చరణ్ ప్రతి ఏడాది అయ్యప్ప దీక్ష తీసుకుంటాడు. అయ్యప్ప స్వామికి భక్తుడైన రామ్ చరణ్ అయ్యప్ప  మాలలతో ఆలయాన్ని సందర్శిస్తాడు. చరణ్ చాలా సంవత్సరాలుగా నల్ల రంగు దుస్తులు, మెడలో చిన్న రుద్రాక్ష హారాన్ని ధరించి అయ్యప్ప దీక్ష సంప్రదాయాన్ని పాటిస్తున్నాడు. ఈ దీక్షా సమయంలో 41 రోజుల పాటు చెప్పులు లేకుండా ఉంటాడు.

Also Read: RK Selvamani: ప్రముఖ దర్శకుడు, రోజా భర్త సెల్వమణి పై కోర్టు అరెస్ట్ వారెంట్.. నెక్స్ట్ విచారణ ఈనెల 23కి వాయిదా