AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akkineni Naga Chaitanya: స్పీడ్ పెంచిన నాగచైతన్య.. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతూ..

అక్కినేని నాగచైతన్య (Akkineni ) ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. గతేడాది శేఖర్ కమ్ముల తెరెకెక్కించిన లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్

Akkineni Naga Chaitanya: స్పీడ్ పెంచిన నాగచైతన్య.. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతూ..
Nagachaitanya
Rajitha Chanti
|

Updated on: Apr 06, 2022 | 1:17 PM

Share

అక్కినేని నాగచైతన్య (Akkineni ) ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. గతేడాది శేఖర్ కమ్ముల తెరెకెక్కించిన లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని ఫాంలోకి వచ్చాడు చై.. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా బంగార్రాజు సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. అక్కినేని నాగార్జున, చైతూ కలిసి నటించిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రమ్యకృష్ణ, కృతిశెట్టి కీలకపాత్రలలో నటించారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సిక్వెల్‏గా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ప్రస్తుతం చైతూ.. థ్యాంక్యూ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తిచేశాడు. తాజాగా చైతూ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

నాగ చైతన్య హీరోగా డైరెక్టర్ వెంకట్ ప్రభు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందనున్న చైతూ 22వ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరెకెక్కిస్తున్నాయి. నావెల్ కంటెంట్‌తోపాటు స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వెంక‌ట్ ప్ర‌భు త‌న `మానాడు` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. రామ్ నటిస్తున్న `వారియర్, బోయపాటి శ్రీను- రామ్ కాంబినేష‌న్‌ చిత్రంతో సహా కొన్ని సెన్సేష‌న‌ల్ ప్రాజెక్ట్‌ లను చేయ‌బోతున్న ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్‌ లో నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. తెలుగు, త‌మిళ భాషల్లో ఏకాకాలంలో రూపొంద‌బోతున్న ఈ చిత్రాన్ని హైటెక్నిక‌ల్ స్టాండర్డ్స్ తో భారీ బడ్జెట్‏లో నిర్మించనున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా రూపొందించ‌నున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, అనుభ‌జ్ఞులైన‌ సాంకేతిక నిపుణులు ప‌ని చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Also Read: Viral Photo: ఈ ఇద్దరు చిన్నారులు అమ్మాయిల ఫేవరేట్ హీరోస్.. ఈ బ్రదర్స్ ఇద్దరి క్రేజ్ వేరేలెవల్..

Anjali: క్రేజీ అప్డేట్.. రామ్ చరణ్, శంకర్ సినిమాలో అంజలి ?.. ఏ పాత్రలో అంటే..

Samantha: విడాకుల తర్వాత తొలిసారి నాగచైతన్య ఫోటో షేర్ చేసిన సమంత.. ఎందుకంటే..

Viral Video: వధూవరులకు స్టేజ్ పైనే షాకిచ్చిన స్నేహితులు.. ఏం చేశారో తెలిస్తే షాకవుతారు.. వీడియో వైరల్..

రాయ్‌పూర్ టీ20లో భారత్ ఊచకోత..ఒకే మ్యాచ్‌లో 5 ప్రపంచ రికార్డులు
రాయ్‌పూర్ టీ20లో భారత్ ఊచకోత..ఒకే మ్యాచ్‌లో 5 ప్రపంచ రికార్డులు
దేశ బంగారు రాజధాని.. ప్రతి గల్లీలో పసిడి కాంతులే.. సౌతిండియా..
దేశ బంగారు రాజధాని.. ప్రతి గల్లీలో పసిడి కాంతులే.. సౌతిండియా..
సెట్‌లో ఒకసారి ఎన్టీఆర్‌ను తిట్టానని.. ఆయన తల్లి ఏం చేసిందంటే
సెట్‌లో ఒకసారి ఎన్టీఆర్‌ను తిట్టానని.. ఆయన తల్లి ఏం చేసిందంటే
సన్‌రైజర్స్ నయా రికార్డ్.. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు కావ్య సేన
సన్‌రైజర్స్ నయా రికార్డ్.. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు కావ్య సేన
అక్కడ SI.. తెలుగులో విలన్.. దేవి సినిమా నటుడి గురించి తెలిస్తే..
అక్కడ SI.. తెలుగులో విలన్.. దేవి సినిమా నటుడి గురించి తెలిస్తే..
అనేక రోగలను దూరం చేసే బెస్ట్ స్నా..రోజూ తింటే ఈ సమస్యలన్నీ దూరం..
అనేక రోగలను దూరం చేసే బెస్ట్ స్నా..రోజూ తింటే ఈ సమస్యలన్నీ దూరం..
మామిడి తోటలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. దూరం నుంచి చూడగా
మామిడి తోటలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. దూరం నుంచి చూడగా
పుష్పరాగము ఉంగరం ధరిస్తే.. మీ జీవితంలో ఊహించని లాభాలు చూస్తారు..!
పుష్పరాగము ఉంగరం ధరిస్తే.. మీ జీవితంలో ఊహించని లాభాలు చూస్తారు..!
లోన్ కట్టలేదని ఇల్లు జప్తు.. యజమాని ఏం చేశాడో తెలిస్తే
లోన్ కట్టలేదని ఇల్లు జప్తు.. యజమాని ఏం చేశాడో తెలిస్తే
కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి..? మీరు చేసే ఈ పొరపాట్లతో మీ..
కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి..? మీరు చేసే ఈ పొరపాట్లతో మీ..