Anjali: క్రేజీ అప్డేట్.. రామ్ చరణ్, శంకర్ సినిమాలో అంజలి ?.. ఏ పాత్రలో అంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో చరణ్,

Anjali: క్రేజీ అప్డేట్.. రామ్ చరణ్, శంకర్ సినిమాలో అంజలి ?.. ఏ పాత్రలో అంటే..
Rc 15
Follow us

|

Updated on: Apr 06, 2022 | 7:56 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan ) ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. తారక్ కొమురం భీం పాత్రలో నటించి మెప్పించారు. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‏తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా మార్చి 25న విడుదలై ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వసూళ్లను కొల్లగొడుతూ దూసుకుపోతుంది. ఈ మూవీ తర్వాత చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‏గా నటిస్తోంది. గతంలో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయ్యింది. ఇప్పటివరకు 30 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా రాజమండ్రి షెడ్యూల్ సమయంలో బ్రేక్ తీసుకుంది.

రాజమండ్రి నుంచే తిరిగి షెడ్యూల్ స్టార్ట్ అవుతుందట. ఆ తర్వాత దుబాయ్, హైదరాబాద్ ప్రాంతాలలో షెడ్యూల్స్ ఉంటాయని అంటున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఇందులో తెలుగుమ్మాయి అంజలి కీలకపాత్రలో నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్‏గా చరణ్ సరసన అంజలి కనిపించబోతుందని సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని టాక్. ఇక ఈ సినిమాను కూడా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో చెర్రీ ఐఎస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడని, రాజకీయ వ్యవస్థకు.. ప్రభుత్వ వ్యవస్థకు మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథాంశమని వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో చరణ్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడని సమాచారం.

Also Read: Rashmi Gautam: యాంకరమ్మ అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న ఫాన్స్.. రష్మీ లేటెస్ట్ ఇమేజెస్

Rashmika Mandanna: బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీవల్లి.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..

Samantha-Yashoda: యశోద సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..

Beast: బీస్ట్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. పవర్‏పుల్ యాక్షన్‏తో అదరగొట్టిన విజయ్ దళపతి..