AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వధూవరులకు స్టేజ్ పైనే షాకిచ్చిన స్నేహితులు.. ఏం చేశారో తెలిస్తే షాకవుతారు.. వీడియో వైరల్..

సాధారణంగా పెళ్లిలో వధూవరులకు బహుమతులు అందచేయడం ఆనవాయితీ. కేవలం బంధువులు, కుటుంబసభ్యులు మాత్రమే కాకుండా

Viral Video: వధూవరులకు స్టేజ్ పైనే షాకిచ్చిన స్నేహితులు.. ఏం చేశారో తెలిస్తే షాకవుతారు.. వీడియో వైరల్..
Viral
Rajitha Chanti
|

Updated on: Apr 06, 2022 | 7:30 AM

Share

సాధారణంగా పెళ్లిలో వధూవరులకు బహుమతులు అందచేయడం ఆనవాయితీ. కేవలం బంధువులు, కుటుంబసభ్యులు మాత్రమే కాకుండా.. వధువు, వరుల స్నేహితులు వివాహనికి విచ్చేస్తూ ఆసక్తికరమైన బహుమతులను తీసుకువస్తుంటారు. అయితే కొందరు తమ వధూవరులను ఆటపట్టించడానికి కామెడీగా బహుమతులు ఇస్తుంటారు. పెనం, చపాతీ కర్ర లాంటి వస్తువులను కానుకగా ఇవ్వడం చూసింటాం. కానీ వాష్ రూం బ్రష్ దగ్గర్నుంచి.. మగ్గు, బకెట్ వంటి వస్తువులను కానుకగా ఇవ్వడం చూశారా.. కానీ నిజంగానే ఇలాంటి కానుకలు ఇచ్చారు కొందరు స్నేహితులు. తమ మిత్రులు చేసిన పనికి ఆ వధూవరులిద్దరూ ముందుగా షాకైనప్పటికీ ఆ తర్వాత నవ్వుతూ ఆ బహుమతులను అందుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వధూవరులిద్దరు స్టేజ్ పై ఉండగా.. ముందుగా ఓ వ్యక్తి వచ్చి వారిద్దరి ఓ ఖాళీ కవర్ ఇచ్చి పట్టుకోమని చెప్తాడు.. ఆ తర్వాత ఒక్కొక్కరిగా వరుడి స్నేహితులు వచ్చి కానుకలను ఆ కవర్లో వేయడం ప్రారంభించారు. ముందుగా వచ్చిన వ్యక్తి బ్రాత్రూమ్ బ్రష్ తీసుకురాగా ఆ తర్వాత వచ్చిన తర్వాత వచ్చిన వ్యక్తి.. సోప్ బాక్స్.. పిండి జల్లెడ, బకెట్, మగ్గు వంటి వస్తువులను తీసుకువస్తూ ఆ కవర్లో వేశారు . అయితే తమ స్నేహితులు ఇస్తున్న ఆ వస్తువులను ఆ నూతన జంట నవ్వుతూనే అందుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Rashmi Gautam: యాంకరమ్మ అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న ఫాన్స్.. రష్మీ లేటెస్ట్ ఇమేజెస్

Rashmika Mandanna: బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీవల్లి.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..

Samantha-Yashoda: యశోద సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..

Beast: బీస్ట్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. పవర్‏పుల్ యాక్షన్‏తో అదరగొట్టిన విజయ్ దళపతి..