AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ananya Panday: అలాంటి పాత్రలు చేస్తే హీరోని ఒకలా.. హీరోయిన్‌ను మరోలా ట్రీట్ చేస్తారంటున్న ‘లైగర్’ భామ..

సినిమా ఇండస్ట్రీలో లింగవివక్ష ఉందని ఇప్పటికే కొంతమంది సినిమాతారలు బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు పెద్దగా ఆదరణ చూపించరని..

Ananya Panday: అలాంటి పాత్రలు చేస్తే హీరోని ఒకలా.. హీరోయిన్‌ను మరోలా ట్రీట్ చేస్తారంటున్న 'లైగర్' భామ..
Ananya
Rajeev Rayala
|

Updated on: Apr 06, 2022 | 5:41 PM

Share

సినిమా ఇండస్ట్రీలో లింగవివక్ష ఉందని ఇప్పటికే కొంతమంది సినిమాతారలు బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు పెద్దగా ఆదరణ చూపించరని కొందరు హీరోయిన్స్ చెప్పుకుంటూ వస్తున్నారు. హీరోలకు ఉన్నంత క్రేజ్ , మైలేజ్ హీరోయిన్స్ కు ఉండదు అనేది వారి వాదన. ఇప్పటికే కంగనా రనౌత్(Kangana Ranaut), దీపికా పదుకొనే వంటివారు లింగ వివక్ష పై స్పందించారు. కంగనా రనౌత్ అయితే మీడియా ముందే సంచలన కామెంట్స్ చేసింది. ఎంత మంచి కథతోనైనా నటనకు ప్రాధాన్యత ఉన్న కథలనైనా హీరోయిన్స్ చేస్తే ఒకలా హీరోలు చేస్తే మరోలా చూస్తారంటూ అంటున్నారు కొందరు హీరోయిన్స్.. ఇక ఇటీవల అందాల భామ తాప్సీ కూడా లింగ వివక్షత పైన స్పందించింది. హీరోల సినిమాలను చూడటానికి ప్రేక్షకులు వస్తారు.. కానీ హీరోయిన్ కోసం సినిమాలకు ప్రేక్షకులు రారు. ఎప్పటి నుంచో ప్రేక్షకులు దీనికి అలవాటు పడిపోయారు. ఇది మారాలి అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా మరో బ్యూటీకూడా లింగ వివక్షత పై స్పందించింది.

యంగ్ హీరోయిన్ అనన్య పాండే స్పందిస్తూ.. హీరోయిన్స్ ఏదైనా కొత్త ప్రయత్నం చేస్తే ప్రేక్షకులు ఎంకరేజ్ చేయరు.. కానీ హీరోలు చేస్తే మాత్రం ప్రేక్షకులు ఆదరిస్తారు అంటూ చెప్పుకొచ్చింది అనన్య. ఓ హీరో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తే ఆడియన్స్ ఆదరిస్తారు.. కానీ హీరోయిన్ చేస్తే మాత్రం దాన్ని ఒప్పుకోవడానికి ముందుకు రారు అంటుంది అనన్య. ఇక అనన్య లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.. అలాగే ఈ సినిమాలో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akkineni Naga Chaitanya: స్పీడ్ పెంచిన నాగచైతన్య.. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతూ..

Aamna Sharif: డిఫరెంట్ ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న ఆమ్నా షరీఫ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Ram Charan: అయ్యప్ప దీక్షలో అమృత సర్‌లో ల్యాండ్ అయిన రామ్ చరణ్.. నెక్స్ట్ సినిమా షూటింగ్‌తో బిజిబిజీ