Raashii Khanna: ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన రాశిఖన్నా..

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది బబ్లీ బ్యూటీ రాశిఖన్నా. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది.

Raashii Khanna: ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన రాశిఖన్నా..
Rashi Khanna
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 06, 2022 | 6:11 PM

Raashii Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైంది బబ్లీ బ్యూటీ రాశిఖన్నా(Raashii Khanna). తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది. తక్కువ సమయంలోనే మంచి అవకాశాలను అందుకుంది. ఈ కుర్రాది దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. వరుస సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇప్పుడు వెబ్‌సిరీస్‌లతోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం గోపీచంద్‌తో కలిసి పక్కా కమర్షియల్‌ చిత్రంలో నటిస్తోంది రాశి. దీంతోపాటు నాగచైతన్యతో కలిసి థ్యాంక్యూ సినిమాలో స్క్రీన్ షేర్‌ చేసుకోనుంది. వీటితో పాటు సర్దార్‌ (తమిళం), యోధా(హిందీ), షైతాన్‌ కా బచ్చా(హిందీ) సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోందీ అందాలతార. తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ వార్త గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కోసుతుంది. ఈ ముద్దుగుమ్మ సౌత్ సినిమాల పై అలిగింది టాక్.

సౌత్ లో తన టాలెంట్ కు తగ్గ సినిమాలు రావడం లేదని.. దాంతో సౌత్ సినిమాలపై ఆమె ఫోకస్ పెట్టడం లేదని వార్తలు పుట్టుకొచ్చాయి. దాంతో రాశిఖన్నా పై నెగటివ్‌ ప్రచారం మొదలైంది. ఆమెను టార్గెట్ చేసి కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విషయం పై తాజాగా రాశి స్పందించింది. తన గురించి వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది.. సౌత్ సినిమాలను దూషిస్తూ నేను వ్యాఖ్యలు చేశానంటూ కొన్ని అసత్య ప్రచారాలు నెట్టింట వైరల్‌గా మారాయి. వాటిలో ఏమాత్రం నిజం లేదు. నేను ప్రతి భాషను, ప్రతి సినిమాను గౌరవిస్తాను. కాబట్టి దయచేసి ఆ ప్రచారాలను ఇకనైనా ఆపండి. అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది రాశిఖన్నా. అయితే రాశిఖన్నా ‘మద్రాస్‌ కేఫ్‌’అనే బాలీవుడ్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో టాలీవుడ్ వైపు అడుగులేసింది. చాలా కాలం తర్వాత రీసెంట్ గా రుద్ర అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో రాశిఖన్నా సౌత్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడిందని పుకార్లు పుట్టుకొచ్చాయి.

Rashi Khanna.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akkineni Naga Chaitanya: స్పీడ్ పెంచిన నాగచైతన్య.. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతూ..

Aamna Sharif: డిఫరెంట్ ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న ఆమ్నా షరీఫ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Ram Charan: అయ్యప్ప దీక్షలో అమృత సర్‌లో ల్యాండ్ అయిన రామ్ చరణ్.. నెక్స్ట్ సినిమా షూటింగ్‌తో బిజిబిజీ

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు