Sridevi Shobhan Babu: ‘శ్రీదేవి శోభన్ బాబు’ మూవీతో వస్తున్న సంతోష్ శోభన్.. టీజర్ లాంచ్ చేసిన డీజే టిల్లు
కుర్ర హీరో సంతోష్ శోభన్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తున్నాడు.
కుర్ర హీరో సంతోష్ శోభన్(santosh sobhan) వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘శ్రీదేవి శోభన్ బాబు’(Sridevi Shobhan Babu) పేరుతో ఓ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాను ఫేమ్ గౌరీ కిషన్ నటించింది. ఈ సినిమాకు సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత గతంలో ఆయన నటించిన ‘ఖైదీ నంబర్ 150’తో పాటు ‘సైరా నరసింహారెడ్డి’తో పాటు పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ మధ్య సుస్మిత కొణిదెల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. సుష్మిత తన భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ ను విడుదల చేశారు.
ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ‘శ్రీదేవి శోభన్ బాబు’ టీజర్ ను క్రేజీ హీరో సిద్దు జొన్నలగడ్డ విడుదల చేశారు. ఇటీవలే డీజే టిల్లు సినిమాతో క్రేజీ హిట్ అనుకున్నాడు సిద్దు. ఈ సినిమాను ప్రశాంత్ కిషోర్ దిమ్మల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. శోభన్ బాబు, శ్రీదేవి నటించిన సినిమాలు ప్రేక్షకులను కనువిందు చేసిన సంగతి తెలిసిందే.. ఈ జోడికి ప్రేక్షకుల్లో అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. అందుకే ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే టైటిల్ ఖరారు చేసారు చిత్రయూనిట్. టీజర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా తప్పకుండ విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది చిత్రయూనిట్.