AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malavika: సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సీనియర్‌ నటి.. మంగమ్మగా అలరించనున్న మాళవిక..

దివంగత డైరెక్టర్‌ ఈవీవీ సత్య నారాయణ దర్శకత్వంలో వచ్చిన చాలా బాగుంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది నటి మాళవిక (Malavika). శ్రీకాంత్, వడ్డే నవీన్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో ఆమె అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.

Malavika: సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సీనియర్‌ నటి.. మంగమ్మగా అలరించనున్న మాళవిక..
Malavika
Follow us
Basha Shek

|

Updated on: Apr 06, 2022 | 7:30 PM

దివంగత డైరెక్టర్‌ ఈవీవీ సత్య నారాయణ దర్శకత్వంలో వచ్చిన చాలా బాగుంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది నటి మాళవిక (Malavika). శ్రీకాంత్, వడ్డే నవీన్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో ఆమె అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినిమాల్లో బిజీగా ఉండగానే 2007లో సురేష్‌ మేనన్‌ అనే వ్యక్తిని వివాహమాడింది. అప్పటినుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటోంది. కాగా చివరిసారిగా రజనీ కాంత్, నయన్ కలిసి నటించిన చంద్రముఖి సినిమాలో కనిపించిన మాళవిక మళ్లీ ముఖానికి మేకప్‌ వేసుకునేందుకు సిద్ధమైంది. కొన్ని రోజుల క్రితం బుల్లితెరపై ఓ టీవీ ఛాట్‌షోలో పాల్గొన్న ఆమె తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించేందుకు రెడీ అయిపోయింది.

కాగా 1999లో ప్రముఖ కోలీవుడ్‌ డైరెక్టర్ సుందర్  డైరెక్షన్‌లో అజిత్‌ హీరోగా తెరకెక్కిన ‘ఉన్నై తేడి’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది మాళవిక. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది ఈ అందాల తార. గోల్‌మాల్ (తమిళం) అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆమె ‘మంగమ్మ’ అనే పాత్రలో కనిపించనుంది. జై, జీవా హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో అమృత అయ్యర్‌, రైజా విల్సన్‌, ఐశ్వర్య దత్తా, మనోబాలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్‌ పట్టాలెక్కింది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లో మాళవిక పాల్గొన్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఇవి ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Also Read: Raashii Khanna: ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన రాశిఖన్నా..

Andhra Pradesh: పెట్టుబడుల స్వర్గధామంగా ఏపీ.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో అగ్రస్థానం..

LSG vs DC, IPL 2022 Match Prediction: కీలక ఆటగాళ్ల చేరికతో బలపడిన ఇరుజట్లు.. లక్నో వర్సెస్ ఢిల్లీ పోరులో విజేతలెవరో?