LSG vs DC, IPL 2022 Match Prediction: కీలక ఆటగాళ్ల చేరికతో బలపడిన ఇరుజట్లు.. లక్నో వర్సెస్ ఢిల్లీ పోరులో విజేతలెవరో?
Lucknow Super Giants vs Delhi Capitals Preview: లక్నో సూపర్ జెయింట్స్ జట్టు హ్యాట్రిక్ విజయం సాధించాలని చూస్తుంది. అయితే వారు ఢిల్లీ క్యాపిటల్స్‌పై చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్(Lucknow Super Giants), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో గురువారం తలపడనుంది. ఇది ఇద్దరు ప్రతిభావంతులైన క్రికెటర్లు, భారత భవిష్యత్ కెప్టెన్లుగా పేరుగాంచిన లోకేష్ రాహుల్ వర్సెస్ రిషబ్ పంత్ (Rishabh Pant) మధ్య పోటీ ఉండనుంది. తమదైన రోజు ఎలాంటి బౌలింగ్‌నైనా ధ్వంసం చేయగల సత్తా ఉన్న రాహుల్, పంత్‌లు ఐపీఎల్ తొలి దశలోనే తమ జట్టును పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే కొద్ది సంవత్సరాలలో టీమిండియా ఎంతో క్రికెట్ ఆడనుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పనిభారాన్ని నిర్వహించడం కూడా చాలా కీలకం. రాహుల్, పంత్ ఇద్దరూ భవిష్యత్ కెప్టెన్లుగా తమ వాదనను సుస్థిరం చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌కు అందుబాటులోకి రానున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి దూకుడు బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ లక్నో జట్టులో చేరనున్నారు. ఇది రెండు జట్ల ప్లేయింగ్ XIని బలోపేతం చేస్తుంది.
జట్టులోకి వచ్చిన డేవిడ్ వార్నర్..
లక్నో జట్టులో ఆండ్రూ టై లేదా ఎవిన్ లూయిస్ స్థానంలో స్టోయినిస్, టిమ్ సీఫెర్ట్ స్థానంలో వార్నర్‌ను క్యాపిటల్స్ జట్టులోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. రెండు జట్ల బౌలింగ్ ఆందోళన కలిగించినా.. గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలో సూపర్ జెయింట్స్ జట్టు ఆకట్టుకుంది. జాసన్ హోల్డర్ చేరికతో లక్నో జట్టు మరింత పటిష్టంగా మారిందని, పృథ్వీ షాతో కలిసి వార్నర్ దూకుడు ఆరంభాన్ని ఇస్తారని ఢిల్లీ జట్టు భావిస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రెండు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన లక్నో కెప్టెన్ రాహుల్, సూపర్ కింగ్స్‌పై క్వింటన్ డి కాక్ ప్రదర్శనను పునరావృతం చేయాలని కోరుకుంటున్నాడు. అయితే వార్నర్‌తో మరింత బలపడనున్న ఢిల్లీ బ్యాటింగ్‌ను లక్నో బౌలర్లు కట్టడి చేయాల్సి ఉంటుంది. కెప్టెన్ పంత్, పృథ్వీల నుంచి భారీ ఇన్నింగ్స్ కోసం జట్టు కూడా ఎదురుచూస్తోంది.
లలిత్ యాదవ్‌పై జట్టు ఆశలు పెట్టుకుంది..
ప్రతి మ్యాచ్‌కు లలిత్ యాదవ్ ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. అయితే అనుభవజ్ఞుడైన మన్‌దీప్ సింగ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో బలహీనంగా మారాడు. సూపర్‌జెయింట్స్ జట్టులో మార్క్‌వుడ్ లేకపోవడంతో పేస్ బౌలింగ్‌లో ఇబ్బందులుపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్ మాజీ కెప్టెన్ మన్‌దీప్‌కు పంత్, కోచ్ రికీ పాంటింగ్ మరో అవకాశం ఇవ్వవచ్చని తెలుస్తోంది.
మన్‌దీప్‌ను తొలగిస్తే, అతని స్థానంలో కోన భరత్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్ రూపంలో ఢిల్లీ జట్టుకు మూడు ఎంపికలు ఉన్నాయి. ఫస్ట్‌క్లాస్ సీజన్‌లో సర్ఫరాజ్ మంచి ఫామ్‌లో ఉండగా, గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు భారత్ బాగా రాణించాడు. లక్నో గురించి చెప్పాలంటే మనీష్ పాండే బ్యాటింగ్ జట్టుకు ఆందోళన కలిగిస్తుంది. గంభీర్ తన ఆటగాళ్లకు మద్దతుగా నిలిచాడు. ఇటువంటి పరిస్థితిలో, ప్లేయింగ్ XIలో పాండే స్థానం కొనసాగవచ్చు. అలాగే, భారత బ్యాటింగ్ ఎంపికల విషయానికి వస్తే లక్నో బెంచ్ బలంగా లేదనే వాస్తవాన్ని కాదనలేం. జట్టులో మనన్ వోహ్రా, ఉత్తరప్రదేశ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కరణ్ శర్మ ఉన్నారు. కరణ్ నేర్చుకోవాల్సింది చాలా ఉండగా, ఐపీఎల్‌లో దశాబ్ద కాలం గడిపిన తర్వాత కూడా వోహ్రా తనను తాను నిరూపించుకోలేకపోయాడు.
లక్నో ప్రాబబుల్ ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్, మనీష్ పాండే, ఇవాన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.
ఢిల్లీ ప్రాబబుల్ ప్లేయింగ్ XI: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, టిమ్ సీఫెర్ట్, కోన శ్రీకర్, రిషబ్ పంత్, లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్.