Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MIM Corporator: ఎంఐఎం కార్పొరేటర్‌ గౌస్‌ అరెస్ట్‌.. మంత్రి కేటీఆర్‌ సూచనతో స్పందించిన పోలీసులు

MIM Corporator Arrest: ఎంఐఎం కార్పొరేటర్‌(MIM CORPORATOR) గౌస్‌‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముషీరాబాద్‌లో పోలీస్ విధులను అడ్డుకోవడమే కాకుండా.. వారిపై దురుసుగా ప్రవర్తించారు.హైదరాబాద్‌ బోలక్‌పూర్‌లో..

MIM Corporator: ఎంఐఎం కార్పొరేటర్‌ గౌస్‌ అరెస్ట్‌.. మంత్రి కేటీఆర్‌ సూచనతో స్పందించిన పోలీసులు
Mim Corporator Gauss
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 06, 2022 | 3:59 PM

ఎంఐఎం కార్పొరేటర్‌(MIM CORPORATOR) గౌస్‌‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముషీరాబాద్‌లో పోలీస్ విధులను అడ్డుకోవడమే కాకుండా.. వారిపై దురుసుగా ప్రవర్తించారు.హైదరాబాద్‌ బోలక్‌పూర్‌లో పోలీసులతో కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించిన ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్.. డీజీపీకి చేసిన ట్వీట్​పై పోలీసులు స్పందించారు.   కేటీఆర్‌ సూచనతో గౌస్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు పోలీసులు. వైద్య పరీక్షలు కోసం గాంధీ హాస్పిటల్​కు తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు.

రెండు రోజుల క్రితం అర్ధరాత్రి పూట.. బోలక్‌పూర్‌లో తెరిచి ఉంచిన దుకాణాలు మూసేయాలని దుకాణదారులకు పోలీసులు చెప్పారు. రంజాన్ సందర్భంగా తెరుచుకున్నామంటూ దుకాణాదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన కార్పొరేటర్ గౌసుద్దీన్.. పోలీసులపై దుర్భాషలాడారు. వాళ్లపైకి దూసుకెళ్లి దౌర్జన్యం చేశారు. దుకాణాలు మూసేదిలేదని వారితో వాగ్వాదానికి దిగాకు. ఈ వీడియోను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌‌గా మారింది.

పోలీసులను ధూషించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. స్పందించిన కేటీఆర్ డీజీపీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. కార్పొరేటర్‌గా గెలిచినంత మాత్రాన.. పోలీసులంటే గౌరవం ఇవ్వరా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా..? అందరికీ ఉన్న రూల్స్ వాళ్లకి వర్తించవా..? ఏంటి ఆ పొగరు. ఏం చూసుకుని ఆ దురుసు.. అంటూ పాతబస్తీలో పోలీసుల పట్ల ఎంఐఎం( MIM)కార్పొరేటర్ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో కార్పొరేటర్‌ గౌస్‌ తీరుపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వాళ్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇటువంటి వాటికి తావులేదని, తప్పు చేసిన వాళ్లపై రాజకీయ పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాల్సిందేనని కేటీఆర్ అన్నారు.

ఇవి కూడా చదవండి: Viral Video: పిల్లలపై కన్ను.. గద్దను చీల్చిచెండాడిన కోడి.. వీడియో చూస్తే వెన్నులో వణుకుపుట్టాల్సిందే..

PMGKAY: కడు పేదరికం వృద్ధికి ముకుతాడు.. కేంద్ర ఆహార భద్రత పథకానికి IMF ప్రశంసలు..