Optical Illusion: ఈ ఫోటోలో ఏముందో గుర్తించండి.. మొదటగా కనిపించేదే మీ బలం..

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మరో ఆప్టికల్ ఇల్యూషన్ పిక్చర్ మనోభావాలను గుర్తు పడుతుంది. ఈ చిత్రం చూడటానికి చాలా సులభం అయినప్పటికీ.. సమాధానం ఇచ్చిన తర్వాత మీరు..

Optical Illusion: ఈ ఫోటోలో ఏముందో గుర్తించండి.. మొదటగా కనిపించేదే మీ బలం..
This Picture
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 06, 2022 | 5:58 PM

కొన్ని చిత్రాలు విచిత్రంగా ఉంటాయి. ఆ చిత్రాలలో కనిపించేది వాస్తవంగా ఉండదు. దీన్ని అర్థం చేసుకోవడానికి మన మనస్సును లగ్నం చేయాల్సి ఉంటుంది. అలాంటి చిత్రాలను ఆప్టికల్ ఇల్యూషన్స్ అంటారు. ప్రచారంలో ఉన్న ఆప్టికల్ ఇల్యూషన్స్(Optical illusion) ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రోజుల్లో వివిధ రకాల ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా అలాంటి చిత్రాలపై కొన్ని సెకన్ల పాటు ఆగి.. అక్కడి ప్రశ్నకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తారు. అలాంటి మరొక చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. అవును, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మరో ఆప్టికల్ ఇల్యూషన్ పిక్చర్ మనోభావాలను గుర్తు పడుతుంది. ఈ చిత్రం చూడటానికి చాలా సులభం అయినప్పటికీ.. సమాధానం ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన సమాధానం ఎంత ఖచ్చితమైనదో మీరు ఏ వ్యక్తిత్వంతో ఉన్నారో తెలుసుకోవచ్చు. చిత్రకారుడు పెయింటింగ్‌ను నలుపు, తెలుపు రంగులతో గీసినట్లు మీరు చిత్రంలో చూడవచ్చు. అయితే, మీరు మొదటి చూపులో చూసేది చాలా ముఖ్యమైనది.

మీరు ముందుగా ఇద్దరి ముఖాలను చూసినట్లయితే-

ఈ చిత్రంలో మీరు మొదట ఇద్దరి ముఖాలను చూసినట్లైతే.. మీరు చాలా కూల్ పర్సన్ అని అర్థం. మీరు ఎవరినైనా కలవడం, మాట్లాడటానికి చాలా ఇష్ట పడుతుంటారు. మీరు అద్భుతమైన వాక్చాతుర్యం కలిగినవారు. మీ మాటలతో ఎదుటివారిని సానుకూలంగా మార్చుకుంటారు. మీతో మాట్లాడటానికి చాలా మంది ఇష్టపడతారు.

మీరు మొదటి వైన్ గ్లాస్ చూసినట్లయితే-

మొదటి చూపులో ఈ చిత్రంలో మీకు వైన్ గ్లాస్ కనిపిస్తే మీరు శక్తి , ప్రేరణతో నిండి ఉన్నారని అర్థం. అయితే, అన్ని రకాల విషయాలు విన్న తర్వాత, మీరు ఒత్తిడికి గురవుతారు. ఒక మంచి విషయమేమిటంటే.. మీరు మీలో పరిపూర్ణులుగా ఉంటారు. ఏ విషయాన్నైనా ముందుగానే పసిగడుతారని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి: MIM Corporator: ఎంఐఎం కార్పొరేటర్‌ గౌస్‌ అరెస్ట్‌.. మంత్రి కేటీఆర్‌ సూచనతో స్పందించిన పోలీసులు

Telangana University: తెలంగాణ యూనివర్సిటీ క్యాంటిన్ టిఫిన్‌లో కప్ప.. విద్యార్థుల ఆందోళన..