IPL 2022: ‘చెన్నై కెప్టెన్ ఇప్పటికీ ధోనినే.. తలనొప్పిగా మారిన జడేజా’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వెటరన్ ప్లేయర్..!
IPL 2022: తన స్పిన్ ఆధారంగా బ్యాట్స్‌మెన్లని బోల్తా కొట్టించే హర్భజన్ సింగ్ ఇప్పుడు వ్యాఖ్యాతగా మారి అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నాడు. ప్రస్తుతం
IPL 2022: తన స్పిన్ ఆధారంగా బ్యాట్స్‌మెన్లని బోల్తా కొట్టించే హర్భజన్ సింగ్ ఇప్పుడు వ్యాఖ్యాతగా మారి అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కామెంటరీ చేస్తున్న హర్భజన్ సింగ్ చెన్నై సూపర్ కింగ్స్ గురించి సంచలన కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు చెన్నై జట్టు కెప్టెన్‌ని మార్చింది. మహేంద్ర సింగ్ ధోనీ సడెన్‌గా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో రవీంద్ర జడేజా కెప్టెన్ అయ్యాడు. అయితే ధోనీ ఇప్పటికీ చెన్నైకి బాధ్యత వహిస్తున్నాడని హర్భజన్ సింగ్ భావిస్తున్నాడు. చెన్నై కెప్టెన్‌గా జడేజాను ఎంపిక చేయడం సరైన నిర్ణయమే అన్నాడు. అయితే అతడు మరింత బాధ్యత వహించాలని సూచించాడు. స్టార్ స్పోర్ట్స్‌తో జరిగిన సంభాషణలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఎంఎస్ ధోనీ ఇప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. జడేజా ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. జట్టు ఫీల్డింగ్ విషయాలపై దృష్టి సారించాల్సి ఉంది. జడేజా తన భారాన్ని తగ్గించుకుంటున్నాడు. ధోనికి బరువుని పెంచుతున్నాడని’ అన్నాడు.
కెప్టెన్‌గా ఉండటానికి జడేజా అర్హుడే: హర్భజన్
జడేజాను కెప్టెన్‌గా చేయడం సరైన నిర్ణయమని అతను గొప్ప క్రికెటర్ అని హర్భజన్ సింగ్ అన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘జడేజా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని భావిస్తున్నాను. అతని బౌలింగ్, బ్యాటింగ్ అద్భుతం. అయితే అతడు జట్టుకి సంబంధించిన కొన్ని సమస్యలపై దృష్టి సారించాలని భావిస్తున్నాను’ అన్నాడు.
బలహీనంగా చెన్నై బౌలింగ్
ప్రస్తుతం చెన్నై బౌలింగ్ చాలా బలహీనంగా ఉందని బ్యాటింగ్ మెరుగవ్వాల్సి ఉందని హర్భజన్ సింగ్ అన్నాడు. కెప్టెన్‌గా జడేజా తనను తాను నిరూపించుకోవాల్సి ఉందని, కెప్టెన్‌గా అతనిపై బెట్టింగ్‌లు వేయడం సరైన నిర్ణయం కాదన్నాడు. జడేజాకు అవగాహన అవసరమని కొద్దిరోజుల్లోనే అతడు నేర్చుకొని మెరుగవుతాడని అన్నాడు. ప్రస్తుత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మొదటి మూడు మ్యాచ్‌లలో ఓడిపోయిన విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ చేతిలో వరుసగా ఓడిపోయింది. ఇప్పుడు చెన్నై ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే మంచి ఆటను ప్రదర్శించాల్సి ఉంది.