Health Tips: రోజు 2 గుడ్ల కంటే ఎక్కువ తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!

Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కచ్చితమైన డైట్‌ పాటించాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. అప్పుడే వ్యాధులకి దూరంగా ఉంటాం. అయితే వర్కౌట్‌లు

Health Tips: రోజు 2 గుడ్ల కంటే ఎక్కువ తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!
Eggs
Follow us
uppula Raju

|

Updated on: Apr 05, 2022 | 6:34 PM

Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కచ్చితమైన డైట్‌ పాటించాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. అప్పుడే వ్యాధులకి దూరంగా ఉంటాం. అయితే వర్కౌట్‌లు చేసే వ్యక్తులు ఫిట్‌గా ఉండటానికి బలమైన ఆహారం తీసుకుంటారు. గుడ్లని ఎక్కువగా తింటారు. ఎందుకంటే ఇందులో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె నుంచి కళ్ళ వరకు అన్ని అవయవాలని కాపాడుతాయి. నాన్-వెజ్ తినడానికి ఇష్టపడేవారు కచ్చితంగా గుడ్లని తింటారు. అయితే అవసరానికి మించి గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఏదైనా అతి హానికరమే అవుతుంది. ఎక్కువగా గుడ్లు తీసుకోవడం ద్వారా మీరు అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం.

గుండెకి ఎఫెక్ట్

గుడ్లు ఎక్కువగా తినడం వల్ల అందులో ఉండే కొలెస్ట్రాల్ గుండెకు ప్రమాదంగా మారుతుంది. ఒక గుడ్డు తింటే 180 కేజీల కొలెస్ట్రాల్ శరీరంలోకి చేరుతుంది. అందుకే రోజు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం మంచిది. గుడ్లు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కోడిగుడ్లను ఎక్కువగా తీసుకోవాలనుకునే వారు అందులోని పసుపు భాగాన్ని తినకూడదు. బదులుగా గుడ్డులోని తెల్లసొనను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.

రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి..

గుడ్డు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే గుడ్డులో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అధిక మొత్తంలో కొవ్వు తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ అస్థిరంగా మారుతుంది. ఈ పరిస్థితిలో మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల బారినపడే అవకాశాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి రోజూ రెండు గుడ్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

బరువు పెరగడం

గుడ్లలో ఉండే కొవ్వు మిమ్మల్ని ఊబకాయానికి దగ్గర చేస్తుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని చెప్పినప్పటికీ అధిక వినియోగం హాని కలిగిస్తుంది. వాస్తవానికి ఎక్కువ గుడ్లు తినడం వల్ల శరీరంలో కేలరీల పరిమాణం పెరుగుతుంది. దీంతో విపరీతంగా బరువు పెరుగుతారు. ఒక వ్యక్తి రోజుకు 2000 నుంచి 2400 కేలరీలు మాత్రమే తీసుకోవాలి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

IPL 2022: 2 మ్యాచ్‌ల్లో 13 పరుగులు మాత్రమే చేసిన 8.25 కోట్ల ఆటగాడు.. ఇలా అయితే కష్టమే..!

Viral Photos: ప్రపంచంలో రెండు ముఖాలున్న వింతైన వ్యక్తి ఇతడే.. స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..!

Viral Video: గుడ్డు నుంచి బయటికొచ్చిన డైనోసర్ పిల్ల.. సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..

ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్