Viral Video: గుడ్డు నుంచి బయటికొచ్చిన డైనోసర్ పిల్ల.. సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
Viral Video: భూమిపై అతిపెద్ద జీవులుగా పిలవబడిన డైనోసార్లు మిలియన్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి. అయినప్పటికీ కొన్ని దేశాలలో వాటి గుడ్లు,
Viral Video: భూమిపై అతిపెద్ద జీవులుగా పిలవబడిన డైనోసార్లు మిలియన్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి. అయినప్పటికీ కొన్ని దేశాలలో వాటి గుడ్లు, శిలాజాలు లభిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా డైనోసార్ల గుడ్డుకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో గుడ్డు నుంచి బయటకు వచ్చిన జీవి డైనోసార్ అని చెబుతున్నారు. ఈ వీడియో నిజమా లేక ఫేకా అనే దానిపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. గుడ్డు నుండి బయటకు వచ్చిన జీవి డైనోసర్ అని కొందరు అంటున్నారు. మరికొందరు ఇది ఫేక్ వీడియో అని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. వైరల్‌గా మారిన ఈ వీడియో ల్యాబ్‌లో చిత్రీకరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఒక బుట్టలో రెండు గుడ్లు ఉండటం మనం వీడియోలో చూడవచ్చు. అప్పుడే ఒక మహిళ కత్తెర సహాయంతో ఒక గుడ్డు పెంకును పగలగొట్టడానికి ప్రయత్నిస్తుంది. గుడ్డు పగలడంతో అందులో నుంచి గోధుమ రంగు జీవి ఒకటి బయటకు రావడం మనం గమనించవచ్చు. ఇది చూడ్డానికి మామూలు జంతువులా కనిపించదు. డైనోసర్‌లా దర్శనమిస్తుంది. దీంతో ఇది డైనోసార్ గుడ్డని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై నెటిజన్ల మధ్య విపరీతమైన చర్చ నడుస్తోంది.
ఈ వీడియోని ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. క్యాప్షన్‌లో ‘ఇది నిజమైన డైనోసారా.. లేదా నకిలీదా.. కామెంట్ ద్వారా తెలియజేయండి ‘అని రాశాడు. రెండు రోజుల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోని 14 వేల మందికి పైగా లైక్ చేసారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాల కామెంట్లు తెలియజేస్తున్నారు. కామెంట్ సెక్షన్‌లో ఈ వీడియో నిజమా లేక నకిలీదా అనే చర్చ జరుగుతోంది. మీరు ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ చెప్పండి.
View this post on Instagram