Ramzan 2022: రంజాన్ స్పెషల్..ఖర్జూరం బర్ఫీ ఎలా తయారుచేస్తారో తెలుసా..?
Ramzan 2022: ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో 9వ నెల రంజాన్ నెలగా పరిగణిస్తారు.
Ramzan 2022: ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో 9వ నెల రంజాన్ నెలగా పరిగణిస్తారు. ఈ మాసంలో ప్రజలు రోజంతా ఆకలితో, దాహంతో అల్లాని ఆరాధిస్తారు. సుమారు 29 రోజుల నుంచి 30 రోజుల పాటు ఉపవాసం ఉన్న తర్వాత రంజాన్ పండుగతో ఈ తంతు ముగుస్తుంది. దీనినే ఈద్-ఉల్-ఫితర్ అంటారు. ఈ పండుగ సందర్భంగా సర్వ మతాల వారు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని విందును ఆరగిస్తారు. అయితే పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు సూర్యోదయానికి ముందే భోజనం చేస్తారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత ఆహారం తీసుకుంటారు. దీనినే ఇఫ్తార్ అంటారు. ఉపవాస సమయంలో ముస్లిం మతస్థులు ఏమీ తినరు తాగరు. అయితే రంజాన్ రోజుల్లో ఖర్జూరం బర్ఫీ తిని ఉపవాసం విరమించుకోవచ్చు. ఇది చాలా పోషకమైనది. మీ శరీర బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. వాస్తవానికి ముహమ్మద్ ప్రవక్తకు ఖర్జూరం అంటే చాలా ఇష్టమని, ఖర్జూరం తిన్న తర్వాతే ఇఫ్తార్ చేసేవారని ఒక నమ్మకం. అప్పటి నుంచి ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. అంతే కాకుండా ఖర్జూరాలు ఆరోగ్య పరంగా కూడా చాలా మంచివి. ఇవి శరీరంలోని బలహీనతను దూరం చేసి తక్షణ శక్తిని ఇస్తాయి. కావాలంటే రంజాన్ నెలలో ఖర్జూరం బర్ఫీ తినడం ద్వారా మీరు ఇఫ్తార్ ఉపవాసం చేయవచ్చు. అది ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
ఖర్జూరం బర్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు
2 కప్పుల ఖర్జూరాలు, కప్పు వాల్‌నట్‌లు, కప్పు బాదంపప్పు, కప్పు జీడిపప్పు, కప్పు తురిమిన కొబ్బరి, రెండు చెంచాల పిస్తా, రెండు చెంచాల చిరోంజి, రెండు చెంచాల గసగసాలు, 1 జాజికాయ, 6 నుంచి 7 చిన్న ఏలకులు, అవసరాన్ని బట్టి దేశీ నెయ్యి
బర్ఫీ రెసిపీ
ముందుగా ఖర్జూరం గింజలన్నీ తీసేసి వాటిని మెత్తగా కోయాలి. జీడిపప్పు, బాదం, వాల్‌నట్‌లను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పిస్తాలను పొడవుగా కట్ చేసి, యాలకుల పొట్టు తీసి గింజలను రుబ్బుకోవాలి. జాజికాయను చూర్ణం చేసి పొడి చేయాలి.
ఇప్పుడు గ్యాస్‌పై ఒక పాన్ పెట్టి అందులో జీడిపప్పు, బాదం, వాల్‌నట్ ముక్కలను వేసి తక్కువ మంటపై వేయించాలి. సుమారు రెండు మూడు నిమిషాలు వేయించిన తర్వాత దానిని ఒక ప్లేట్‌లో తీసుకోండి. ఇప్పుడు గ్యాస్‌పై మరో పాన్ ఉంచండి. అందులో రెండు చెంచాల దేశీ నెయ్యి వేయండి. నెయ్యి వేడయ్యాక అందులో గసగసాలు వేసి చిన్న మంట మీద వేయించాలి. గసగసాల రంగు మారినప్పుడు అందులో జాజికాయ పొడి, యాలకుల పొడి వేయండి. తరువాత ఖర్జూరం ముక్కలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, కొబ్బరి, చిరోంజి మొదలైనవి వేయండి. అన్ని వస్తువులను బాగా కలపండి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లో తీసుకోండి. చల్లారగానే చేతికి నెయ్యి రాసుకుని ఆ మిశ్రమాన్ని గుండ్రంగా తయారచేయండి. వాటిని రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచండి. అంతే ఖర్జూర బర్ఫీ రెడీ అయిపోయినట్లే.