AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకి గమనిక.. UAN నెంబర్ గురించి మీకు ఈ విషయం తెలుసా..!

EPFO: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ (EPF)లో యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈపీఎఫ్‌కి సంబంధించిన అనేక పనులు సులభతరం

EPFO: పీఎఫ్ ఖాతాదారులకి గమనిక.. UAN నెంబర్ గురించి మీకు ఈ విషయం తెలుసా..!
Epfo
uppula Raju
|

Updated on: Apr 04, 2022 | 9:55 PM

Share

EPFO: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ (EPF)లో యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈపీఎఫ్‌కి సంబంధించిన అనేక పనులు సులభతరం అయ్యాయి. మీరు EPF నుంచి డబ్బును విత్‌ డ్రా చేయాలనుకున్నా, EPFలో నామినీ పేరుని నమోదు చేయాలన్నా, PF నుంచి లోన్‌ తీసుకోవాలనుకున్నా UAN నెంబర్ అవసరం. దీనివల్ల ఇప్పుడు ఈ పనులన్ని సులభతరం అయ్యాయి. యూనివర్సల్ ఖాతా సంఖ్య అంటే ఎప్పటికీ మారని ఖాతా సంఖ్య అని అర్థం. ఉద్యోగి కంపెనీ మార్చినా యూనివర్సల్ ఖాతా సంఖ్య మారదు. పాస్‌బుక్ నంబర్ మారే అవకాశాలు ఉన్నాయి కానీ UAN నెంబర్ మారదు. ఈ నెంబర్ సహాయంతో సభ్యుడు అనేక సౌకర్యాలను పొందుతాడు. UAN అనేది ఈపీఎఫ్‌వో​జారీ చేసిన 12 అంకెల సంఖ్య.

ఈపీఎఫ్‌వో KYCలో UAN నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా సభ్యుడు అనేక రకాల ఆన్‌లైన్ సౌకర్యాలను పొందుతాడు. మీరు UAN లాగిన్ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయవచ్చు లేదా పాస్‌వర్డ్‌ను మార్చుకోవచ్చు. మీ యూనివర్సల్ ఖాతా నంబర్ యాక్టివ్‌గా ఉంటేనే మీరు UAN పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయగలరని గుర్తుంచుకోండి. UAN పాస్‌వర్డ్ కనీసం 7 అక్షరాలు ఉండాలి. 20 అక్షరాల కంటే ఎక్కువ ఉండకూడదు. తప్పనిసరిగా నాలుగు అక్షరాలు, రెండు అంకెలు, ఒక ప్రత్యేక అక్షరం కలిగి ఉండాలి. 4 అక్షరాలలో ఒకటి పెద్ద అక్షరం, ఒక చిన్న అక్షరాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి.

UAN పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయడం ఎలా..?

1. EPFO అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ లాగిన్ అవండి.

2. ‘మర్చిపోయిన పాస్‌వర్డ్’ లింక్‌పై క్లిక్ చేయండి.

3. స్క్రీన్‌పై కనిపించే UAN నంబర్, క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయండి.

4. వివరాలను నమోదు చేసి ఓకె ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

5. మీ పేరు, పుట్టిన తేదీ, లింగం, మొదలైన వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి.

6. ‘వెరిఫై’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

7. వివరాలు సరిపోలిన తర్వాత మీకు OTP వస్తుంది.

8. పాస్‌వర్డ్‌ను రెండుసార్లు నమోదు చేసి ఓకె బటన్‌పై క్లిక్ చేయండి. మీ పాస్‌వర్డ్ విజయవంతంగా మారినట్లు మీకు మెస్పేజ్‌ వస్తుంది.

Health Tips: ముఖంపై వేడి మొటిమలతో ఇబ్బందిపడుతున్నారా.. సింపుల్‌గా ఇలా చేయండి..!

Green Almonds: ఆకుపచ్చ బాదంతో అనేక లాభాలు.. ఈ సమస్యలతో బాధపడేవారికి దివ్య ఔషధం..!

Health Tips: వేసవిలో ఈ 3 ఆహారాలు బెస్ట్.. ఎందుకంటే బరువు పెంచవు..!