Multibagger Stocks: రూ. 13వేల పెట్టుబడిని రూ. కోటిగా మార్చిన బంపర్ స్టాక్.. అదేంటంటే?

ఒకప్పుడు, ఈ కంపెనీ స్టాక్ విలువ దాదాపు రూ.30లు మాత్రమే. ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ.24 వేలు దాటింది. అంటే, ఈ స్టాక్ 81000 శాతం భారీ వృద్ధిని నమోదు చేసింది.

Multibagger Stocks: రూ. 13వేల పెట్టుబడిని రూ. కోటిగా మార్చిన బంపర్ స్టాక్.. అదేంటంటే?
Stock Market
Follow us

|

Updated on: Apr 04, 2022 | 9:28 PM

కొన్ని కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో ఆకట్టుకోవడమే కాక, తమ భౌతిక వ్యాపారాలను కూడా పెంచుకుంటుంటాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ కంపెనీ, ఇంటి గోడలను పటిష్టం చేయడానికి సిమెంట్‌ను తయారు చేస్తుంది. మరోవైపు, ఇది స్టాక్ మార్కెట్‌లో తన పెట్టుబడిదారులకు డబ్బుల వర్షాన్ని కురిపిస్తోంది. కొన్నేళ్ల క్రితం కేవలం రూ.13 వేల రూపాయల పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులను నేడు లక్షాధికారులుగా మార్చిన శ్రీ సిమెంట్ స్టాక్స్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఒకప్పుడు, ఈ కంపెనీ స్టాక్ దాదాపు రూ.30 రూపాయలు మాత్రమే. ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ.24 వేలు దాటింది. అంటే, ఈ స్టాక్ 81000 శాతం భారీ వృద్ధిని నమోదు చేసింది. అయినప్పటికీ ఇది దాని జీవితకాల గరిష్ట స్థాయి కంటే చాలా తక్కువగా ఉంది. ఈ స్టాక్(Multibagger Stocks) లైఫ్ టైమ్ హై 52 వారాల గరిష్టం రూ. 32,048గా నిలిచింది. అదే సమయంలో, 52 వారాల ఈ స్టాక్ కనిష్ట స్థాయి రూ.21,650గా నిలిచింది.

కేవలం రూ. 30 లతో మార్కెట్ ప్రయాణం..

కంపెనీ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించిన తొలి రోజుల్లో అంటే జూలై 2001లో, NSEలో ఈ స్టాక్ విలువ రూ. 30.30గా ఉండేది. దాదాపు 21 సంవత్సరాల ప్రయాణం తర్వాత, ఈరోజు అంటే 04 ఏప్రిల్ 2022న, ఈ స్టాక్ NSEలో రూ. 24,645.45 స్థాయిలో ముగిసింది. దీని ప్రకారం లెక్కిస్తే దాదాపు 81,200 శాతం రాబడిని ఇచ్చింది.

పెట్టుబడిదారులు 800 రెట్లు ధనవంతులు అయ్యారు..

కంపెనీ తన 21 ఏళ్ల ప్రయాణంలో ఎలాంటి రాబడిని అందించిందో ఇప్పుడు తెలుసుకుందాం. పెట్టుబడిదారుల సంపదను దాదాపు 800 రెట్లు పెంచింది. అంటే అప్పట్లో ఒక ఇన్వెస్టర్ ఈ స్టాక్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈరోజు అతని వద్ద రూ.8 కోట్లకు పైగానే ఉంటుంది. ఇది మాత్రమే కాదు, సుమారు 21 సంవత్సరాల క్రితం ఒక పెట్టుబడిదారుడు ఈ స్టాక్‌లో కేవలం రూ.13 వేలు పెట్టుబడి పెట్టినట్లయితే, అతను ఈ రోజు కోటీశ్వరుడు అయ్యేవాడు. ఎందుకంటే అతని ఫోలియో విలువ కోటి రూపాయలు దాటుతుంది.

గమనిక: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల అనేక రకాల రిస్క్‌లు ఉంటాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ముందు, మీరు మీ స్వంత పరిశోధన చేయాలి. లేదా మీ వ్యక్తిగత ఆర్థిక సలహాదారుని సంప్రదించాలి.

Also Read: Senior Citizens: సీనియర్ సిటిజన్లకి బంపర్‌ ఆఫర్.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అదిరిపోయే రిటర్న్స్‌..!

Credit Card: క్రెడిట్ కార్డును.. డెబిట్ కార్డులా వాడుతున్నారా? అయితే చిక్కులు తప్పవు!