- Telugu News Photo Gallery Viral photos Strangest person in the world story of edward mordake the man with two faces
Viral Photos: ప్రపంచంలో రెండు ముఖాలున్న వింతైన వ్యక్తి ఇతడే.. స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..!
Viral Photos: ప్రపంచంలోని ఒక వింత వ్యక్తి గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఇతడికి రెండు ముఖాలు ఉంటాయి. అందులో ఒకటి బాగుంటుంది మరొకటి అంద విహీనంగా ఉంటుంది.
Updated on: Apr 05, 2022 | 5:39 PM

ప్రపంచంలోని ఒక వింత వ్యక్తి గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఇతడికి రెండు ముఖాలు ఉంటాయి. అందులో ఒకటి బాగుంటుంది మరొకటి అంద విహీనంగా ఉంటుంది. రెండు ముఖాలున్న ఈ వ్యక్తిని ఇంగ్లండ్‌కు చెందిన ఎడ్వర్డ్ మోర్డేక్ అని పిలుస్తారు.

రెండు ముఖాల వల్ల ఎడ్వర్డ్ ఏమి చేయలేకపోయాడు. సరిగ్గా మాట్లాడలేకపోయాడు. కానీ నిద్రించడానికి ప్రయత్నించినప్పుడు ఒక ముఖం రాత్రంతా మేల్కొని మాట్లాడుతూ ఉండేది.

మీడియా నివేదికల ప్రకారం1985లో బోస్టన్ పోస్ట్ అనే వార్తాపత్రికలో ఒక నివేదిక ప్రచురించారు. అందులో ఎడ్వర్డ్ రహస్యమైన కథ గురించి చెప్పారు. ఎడ్వర్డ్ తన మరో ముఖంతో విసిగిపోయాడని నివేదికలో రాశారు. ఆ ముఖం వల్ల నిద్రలేని రాత్రులు గడిపాడని చెప్పారు.

ఈ వింత సమస్య గురించి ఎడ్వర్డ్ చాలా మంది వైద్యులను కలిసాడు. అయితే ఎవరూ అతడి సమస్యని పరిష్కరించలేకపోయారు. చాలా మంది వైద్యులు చికిత్స చేసేందుకు నిరాకరించారు.

ఎడ్వర్డ్ 37 సంవత్సరాల వయస్సులో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఎడ్వర్డ్ యొక్క ఈ వింత కథ 1896 నాటి మెడికల్ ఎన్‌సైక్లోపీడియాలో ప్రస్తావించారు. చాలా మంది దీనిని కేవలం ఒక కథగా భావిస్తారు కానీ ఇది నిజమని నమ్మరు.



