Health Tips: ఈ 3 ఆహారాలతో షుగర్, బీపీలకి చెక్.. కచ్చితంగా డైట్‌లో చేర్చండి..!
Health Tips: చాలామంది చెడు జీవనశైలి వల్ల అనారోగ్య సమస్యలని కొని తెచ్చుకుంటున్నారు. సమయపాలన లేని ఆహారపు అలవాట్ల వల్ల రక్తంలో షుగర్
Health Tips: చాలామంది చెడు జీవనశైలి వల్ల అనారోగ్య సమస్యలని కొని తెచ్చుకుంటున్నారు. సమయపాలన లేని ఆహారపు అలవాట్ల వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో బీపీ, షుగర్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా కొంతకాలం ప్రజలు ఇళ్లలో ఉండవలసి వచ్చింది. దీని కారణంగా శారీరక శ్రమ తగ్గింది. దీంతో చాలామంది రోగాలకి గురవుతున్నారు. ఇది మాత్రమే కాదు జంక్ ఫుడ్ వంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ని పెంచుతున్నారు. ఇది గుండె జబ్బులకి కారణమవుతుంది. మరోవైపు అధిక రక్తపోటు సాధారణ సమస్యగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మంచి ఆహారం ఈ వ్యాధుల నుంచి మనల్ని సురక్షితంగా కాపాడుతుంది. మీరు కొన్ని మంచి ఆహారాలని తీసుకోవడం వల్ల అధిక బీపీ, షుగర్ లెవల్స్‌ని నియంత్రించవచ్చు. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుందాం.
1. నేరేడు పండ్లు
వేసవిలో నేరేడు పండ్లు తినడం వల్ల అధిక బీపీ, మధుమేహం అదుపులో ఉంటాయి. ప్రాచీన కాలం నుంచి మధుమేహానికి నేరేడు పండ్లు మంచి విరుగుడుగా బావిస్తారు. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే పొటాషియం అధిక బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని రెగ్యులర్ వినియోగం గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పిల్లల నుంచి వృద్ధాప్యం వరకు రోజూ తినవచ్చు.
2. బీట్‌రూట్
బీట్‌రూట్ శరీరంలో రక్తం కొరతని తీర్చి మనల్ని ఆరోగ్యవంతంగా మార్చుతుంది. అంతేకాదు బీట్‌రూట్ మధుమేహాన్ని నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇందులో ఫోలేట్ ఉంటుంది ఇది రక్తనాళాలని దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ అనే రసాయనం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహకరిస్తుంది. ఇందులో ఉండే చక్కెర సహజమైన గ్లూకోజ్‌గా మారుతుంది. ఈ కారణంగా డయాబెటిక్ రోగులకు ఇది వరమని చెప్పాలి.
3. వెల్లుల్లి
అధిక రక్తపోటును నియంత్రించడంలో వెల్లుల్లి ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ మూలకం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి ప్యాంక్రియాస్‌ను ప్రేరేపిస్తుంది. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు వెల్లుల్లిని అనేక విధాలుగా తినవచ్చు కానీ కాల్చిన వెల్లుల్లి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.