AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs KKR Playing XI IPL 2022: ఇరుజట్లలో చేరనున్న కీలక ఆటగాళ్లు.. రికార్డుల్లో ముంబై, ఈ సీజన్‌లో కోల్‌కతాదే ఆధిపత్యం..

MI vs KKR IPL 2022 Match Head to Head: ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మొత్తం 29 మ్యాచ్‌లు జరగ్గా, అందులో ముంబై జట్టు 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం ఏడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది.

MI vs KKR Playing XI IPL 2022: ఇరుజట్లలో చేరనున్న కీలక ఆటగాళ్లు.. రికార్డుల్లో ముంబై, ఈ సీజన్‌లో కోల్‌కతాదే ఆధిపత్యం..
Mi Vs Kkr Playing Xi Ipl 2022
Venkata Chari
|

Updated on: Apr 05, 2022 | 7:49 PM

Share

గతేడాది రన్నరప్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2022 (IPL 2022) ఇప్పటి వరకు బాగానే ఉంది. గత మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో విజయం సాధించగా, ఒక మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. బుధవారం, ఈ జట్టు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత ముంబయి సీజన్‌ ఇంతవరకు బాగాలేదు. రెండు మ్యాచ్‌లు ఆడి రెండింట్లోనూ పరాజయం పాలైంది. ఇటువంటి పరిస్థితిలో ముంబై కూడా తన విజయ ఖాతాను తెరవడానికి ప్రయత్నిస్తుంది.

పాయింట్ల పట్టికలో ముంబై జట్టు స్థానాన్ని పరిశీలిస్తే.. ఎనిమిదో స్థానంలో నిలిచింది. ముంబయి జట్టులో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. దీంతోనే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఈసారి జట్టులో చాలా మంది కీలక ఆటగాళ్లు లేరు. వారి లోపం జట్టుకు స్పష్టంగా కనిపిస్తుంది. కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా జట్టులో లేరు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రాకు మద్దతుగా నిలిచిన బౌలర్ ఈ సీజన్‌లో జట్టులో కనిపించడం లేదు.

సూర్యకుమార్ తిరిగి వస్తాడా?

కోల్‌కతాపై తమ స్థానాన్ని చూసుకుంటే ముంబై కొన్ని మార్పులు చేయగలదు. సూర్యకుమార్ యాదవ్ ప్లేయింగ్ XIలోకి వస్తే జట్టు మరింత బలపడుతుంది. గత మ్యాచ్‌కు ముందు, సూర్యకుమార్ ఎంపికకు అందుబాటులో ఉన్నాడని, అయితే అతను మ్యాచ్‌లో ఆడలేదని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. మరి తదుపరి మ్యాచ్‌లో ఆడుతాడో లేదో చూడాలి. ఒకవేళ అతను జట్టులోకి వస్తే అన్మోప్రీత్ సింగ్ బయటకు వెళ్లాల్సి రావచ్చు. గత మ్యాచ్‌ల్లో బాసిల్ థంపి చాలా ఖరీదుగా మారాడు. దీంతో అతనిపై వేటు పడే ఛాన్స్ ఉంది. అతని స్థానంలో లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్‌కు రోహిత్ శర్మ అవకాశం ఇవ్వవచ్చు.

కోల్‌కతా ప్లేయింగ్ XIలో మార్పులు..

మరోవైపు కోల్‌కతా గురించి మాట్లాడితే.. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి బరిలోకి దిగనుంది. ఇప్పటి వరకు జట్టు ఆటతీరు బాగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జట్టులో మార్పులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పాట్ కమిన్స్ ఎంపికకు అందుబాటులో ఉంటే, అతను ఖచ్చితంగా జట్టులోకి వస్తాడు. అతని కోసం టిమ్ సౌథీ త్యాగం చేయవలసి ఉంటుంది.

ముంబైదే పైచేయి..

ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల గురించి చెప్పాలంటే.. ముంబైదే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మొత్తం 29 మ్యాచ్‌లు జరగ్గా, అందులో ముంబై జట్టు 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం ఏడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ఈ లెక్కలు ముంబైకి ఆత్మవిశ్వాసం కలిగించడానికి, కోల్‌కతాను భయపెట్టడానికి సరిపోతాయి. అయితే ప్రస్తుత ఫామ్ చూస్తుంటే కోల్ కతా జట్టు పటిష్టంగా కనిపిస్తోంది.

రెండు జట్ల ప్లేయింగ్ XI ఇలా ఉండొచ్చు..

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, జయదేవ్ ఉనద్కత్.

కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, టిమ్ సౌథీ/పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి.