AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket News: వరల్డ్‌ కప్‌లో భారత్‌ ఆశలపై నీళ్లు చల్లిన ప్లేయర్ రిటైర్మెంట్‌.. వన్డే, టెస్ట్‌లకి గుడ్‌బై..!

Cricket News: దక్షిణాఫ్రికా క్రికెటర్ మిగ్నాన్ డు ప్రీజ్ టెస్టు, వన్డే క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా వెల్లడించింది. మిగ్నాన్ డు ప్రీజ్‌ దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా వ్యవహరించింది.

Cricket News: వరల్డ్‌ కప్‌లో భారత్‌ ఆశలపై నీళ్లు చల్లిన ప్లేయర్ రిటైర్మెంట్‌.. వన్డే, టెస్ట్‌లకి గుడ్‌బై..!
Mignon Du Preez
uppula Raju
|

Updated on: Apr 07, 2022 | 3:07 PM

Share

Cricket News: దక్షిణాఫ్రికా క్రికెటర్ మిగ్నాన్ డు ప్రీజ్ టెస్టు, వన్డే క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా వెల్లడించింది. మిగ్నాన్ డు ప్రీజ్‌ దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా వ్యవహరించింది. ఈ 32 ఏళ్ల ప్లేయర్ ఇటీవల న్యూజిలాండ్‌లో జరిగిన 2022 మహిళల ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా జట్టును సెమీ-ఫైనల్‌కి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. భారత్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో అద్భుత అర్ధ సెంచరీ సాధించి చివరి బంతికి జట్టును విజయతీరాలకు చేర్చింది. క్రికెట్ సౌతాఫ్రికా విడుదల చేసిన ఒక ప్రకటనలో మిగ్నాన్ డు ప్రీజ్ మాట్లాడుతూ.. ‘నాలుగు ICC ODI ప్రపంచ కప్‌లలో ఆడే అవకాశం వచ్చింది. ఇవి నా జీవితంలో మరచిపోలేని క్షణాలు. ఇప్పుడు నేను కుటుంబంతో గడపటానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. క్రికెట్ పెద్ద ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. T20 క్రికెట్‌పై దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. అందుకే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పింది.

దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ ప్రస్తుతం చాలా మంచి స్థితిలో ఉందని మిగ్నాన్ డు ప్రీజ్ అంది. రాబోయే తరానికి ఈ గేమ్‌లో ముందుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాల్సిన సమయం ఇది. తనకి సహకరించిన క్రికెట్ సౌతాఫ్రికా, టీమ్ మేనేజ్‌మెంట్, ఆటగాళ్లకు ధన్యవాదాలు తెలిపింది. మిగ్నాన్ డు ప్రీజ్‌ ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఇందులో సెంచరీ సాధించడం విశేషం. ఆమె నవంబర్ 2014లో భారత్‌తో ఈ మ్యాచ్ ఆడింది. ఆమె దక్షిణాఫ్రికా తరపున 154 ODIలు ఆడింది. ఇందులో 32.98 సగటుతో 3760 పరుగులు చేసింది. వన్డే క్రికెట్‌లో రెండు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు సాధించింది. ఆమె అత్యధిక స్కోరు 116 నాటౌట్. ఆమె ఇప్పటివరకు 108 టీ20 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో ఏడు అర్ధ సెంచరీల సాయంతో 1750 పరుగులు చేసింది.

Astro News: దేవుడి ఎదుట పిండి దీపం వెలిగించండి.. ఇంట్లోని ఈ సమస్యలని తరిమికొట్టండి..!

Health Tips: రోజు 2 గుడ్ల కంటే ఎక్కువ తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!

Viral Photos: ప్రపంచంలో రెండు ముఖాలున్న వింతైన వ్యక్తి ఇతడే.. స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..!

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..