AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: అరంగేట్రంలోనే అదరగొట్టిన బేబీ డివిల్లియర్స్‌.. మ్యాచ్‌కే హైలెట్‌గా మారిన నో లుక్‌ సిక్స్‌ చూశారా?

Dewald Brevis: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL-2022) టోర్నీలోకి అడుగుపెట్టక ముందే అందరి దృష్టిని ఆకర్షించాడు దక్షిణాఫ్రికాకు చెందిన డెవాల్డ్‌ బ్రెవిస్‌.

IPL 2022: అరంగేట్రంలోనే అదరగొట్టిన బేబీ డివిల్లియర్స్‌.. మ్యాచ్‌కే హైలెట్‌గా మారిన నో లుక్‌ సిక్స్‌ చూశారా?
Ipl 2022
Basha Shek
|

Updated on: Apr 07, 2022 | 5:07 PM

Share

Dewald Brevis: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL-2022) టోర్నీలోకి అడుగుపెట్టక ముందే అందరి దృష్టిని ఆకర్షించాడు దక్షిణాఫ్రికాకు చెందిన డెవాల్డ్‌ బ్రెవిస్‌. వెస్టిండీస్‌లో జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించడంతో పాటు దేశవాళి క్రికెట్‌లో మెరుపులు మెరిపించాడు. అందుకే అభిమానులు అతనిని జూనియర్‌ ఏబీ, బేబీ డివిల్లియర్స్ అని ముద్దు పేర్లతో పిలుచుకుంటున్నారు. ఈక్రమంలోనే రూ.3కోట్లు పెట్టి మరీ జూనియర్‌ ఏబీని కొనుగోలు చేసింది ముఒంబై ఇండియన్స్‌. మొదటి రెండు మ్యాచ్‌ల్లో డగౌట్‌కే పరిమితమైనా బుధవారం(ఏప్రిల్‌ 6) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్‌ లో ఆడేది మొదటి మ్యాచ్‌ అయినా ఎలాంటి బెరకు లేకుండా బ్యాటింగ్‌ చేశాడు. 19 బంతులు ఎదుర్కొని 29 పరుగులు సాధించాడు. ఈ ఇన్సింగ్స్‌లో చూడచక్కని రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. అయితే అతడు బాదిన ఓ సిక్సర్‌ మాత్రం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

ముంబై ఇన్నింగ్స్‌ 8 ఓవర్‌లో వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో.. బంతిని చూడ‌కుండానే మిడ్‌వికెట్‌ మీదుగా కళ్లు చెదిరే సిక్స్‌ కొట్టాడు బ్రెవిస్‌. ఇది మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే మరో భారీషాట్‌ ఆడే యత్నంలో దురదృష్టవశాత్తూ అదే ఓవర్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. కాగాఈ మ్యాచ్‌లో ముంబై ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కాగా క్రీజులో ఉన్నది కాసేపే అయినా మంచి ఇన్నింగ్స్‌ ఆడిన బ్రెవిస్‌ను కేకేఆర్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ సహా ఇతర ఆటగాళ్లు అభినందిందించడం గమనార్హం.

Also Read: Rajamouli: ఆమిర్ ఖాన్ మా అగ్రిమెంట్ బ్రేక్ చేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..

AP Cabinet Meeting: కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం.. మరికాసేపట్లో మంత్రుల రాజీనామా..!

AP Cabinet: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఆశావహుల్లో ఉత్కంఠ.. అనంత నుంచి పోటీలో ఎవరంటే..?