Sanath Jayasuriya: లంకకు భారత్‌ ఆపన్న హస్తం.. మాజీ క్రికెటర్‌ సనత్ జయసూర్య ఏమన్నాడంటే..

Sanath Jayasuriya: మన పొరుగు దేశమైన శ్రీలంక (Srilanka Crisis) ప్రస్తుతం ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆహారం, ఇంధన వనరుల కొరతతో ఆ దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు.

Sanath Jayasuriya: లంకకు భారత్‌ ఆపన్న హస్తం.. మాజీ క్రికెటర్‌ సనత్ జయసూర్య ఏమన్నాడంటే..
Sanath Jayasuriya
Follow us

|

Updated on: Apr 07, 2022 | 6:48 PM

Sanath Jayasuriya: మన పొరుగు దేశమైన శ్రీలంక (Srilanka Crisis) ప్రస్తుతం ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆహారం, ఇంధన వనరుల కొరతతో ఆ దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఏ వస్తువు కొందామన్నా వందలు, వేలల్లోనే ఖర్చు చేయాల్సిన పరిస్థితి దాపరించింది. ప్రజలు రోడ్డు మీదకు రావడంతో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల నిరసనకారులు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఇంటిని కూడా చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి లంకేయులను ఈ సమస్యలు చుట్టుముట్టాయి. ఈక్రమంలో సంక్షోభ పరిస్థితుల నుంచి లంకను గట్టెక్కించేందుకు ముందుకొచ్చింది భారత్‌. ఇందులో భాగంగా ఇప్పటికే భారీ ఎత్తన బియ్యంతో పాటు ఆహార ధాన్యాల్ని ఆ దేశానికి సరఫరా చేసింది. తాజాగా భారీ మొత్తంలో చమురును కూడా పంపించింది. ఇప్పటివరకు లంకకు 2.7 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా పలు రకాల ఇంధనాలను సరఫరా చేసినట్లు శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. బుధవారం 36,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్, 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్ తో రెండు కన్సైన్మెంట్లను శ్రీలంకకు అందజేసినట్లు శ్రీలంకలోని భారత్ ఎంబసీ ట్విటర్ వేదికగా ప్రకటించింది.

భారత్‌కు రుణపడి ఉంటాం..

కాగా ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకకు భారత్‌ అందిస్తోన్న సాయం పట్ల ఆ దేశ దిగ్గజ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య స్పందించారు. ఈ సందర్భంగా పెద్దన్న తరహాలో సాయం చేసినందుకు భారత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘మా పొరుగు దేశం, పెద్దన్న అయిన భారత్‌ ఎల్లప్పుడూ మా వెన్నంటే ఉంటుంది. భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మేం రుణపడి ఉంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంక్షోభం నుంచి కోలుకోవడం అంత సులువైన పని కాదు. కానీ, భారత్‌ లాంటి దేశాలు ఆపన్నహస్తం అందిస్తే త్వరగా ఈ సంక్షోభం నుంచి బయటపడతామని ఆశిస్తున్నాం’ అని జయసూర్య తెలిపారు.

Also Read:Bangalore Crime: కుమారుడిపై కన్నతండ్రి కర్కశత్వం.. డబ్బులు పోగొట్టుకున్నాడని పెట్రోల్ పోసి నిప్పు.. ఆఖరుకు

Tirumala Darshan: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వారికి ప్రత్యేక దర్శనాలకు అనుమతి..

Ramarao On Duty: బుల్ బుల్ తరంగ్ అంటూ రాబోతున్న మాస్ మహారాజా.. రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్..