AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramarao On Duty: బుల్ బుల్ తరంగ్ అంటూ రాబోతున్న మాస్ మహారాజా.. రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్..

మాస్ మహారాజా రవితేజ (Raviteja) ప్రధాన పాత్రలో డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ' (Ramarao On Duty).

Ramarao On Duty: బుల్ బుల్ తరంగ్ అంటూ రాబోతున్న మాస్ మహారాజా.. రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్..
Raviteja
Rajitha Chanti
|

Updated on: Apr 07, 2022 | 5:02 PM

Share

మాస్ మహారాజా రవితేజ (Raviteja) ప్రధాన పాత్రలో డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty). ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం విడుదలకు సిద్ధమౌతుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించగా.. హీరో వేణు తొట్టెంపూడి రీఎంట్రీతో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి మొదటి పాట ‘బుల్ బుల్ తరంగ్’ని ఏప్రిల్ 10న చిత్ర బృందం విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.. రవితేజ, రజిషా విజయన్ పై చిత్రీకరించిన లవ్లీ సాంగ్ ఇది. ఈ రొమాంటిక్ లవ్లీ మెలోడీలో రవితేజ, రజిషాల కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంటుంది. ఫారిన్ డ్యాన్సర్ల తో స్పెయిన్‌లో ఈ పాటని చాలా లావిష్ గా చిత్రీకరించారు. ఈ రోజు విడుదల చేసిన పోస్టర్లో రవితేజ, రజిషా జోడి బ్యూటిఫుల్ అండ్ స్టయిలీష్ గా వుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్‌లు, టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఫుల్ ప్యాకడ్ యాక్షన్ తో నిండిన టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలని పెంచాయి. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో దివ్యాంశ కౌశిక్‌ మరో హీరోయిన్ పాత్ర పోషిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‏గా సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సి, ఎడిటర్ గా ప్రవీణ్ కేఎల్ పని చేస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ”రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Also Read: Viral Photo: ఆమె నవ్వితే నయాగరా జలపాతం.. నటిస్తే వెండితెరకే అందం.. ఎవరో గుర్తించారా..?

Urfi Javed: KGF మూవీ చూడనందుకు ఫీల్ అవుతున్నా.. రామ్ చరణ్ హ్యాండ్‌సమ్ హీరో అంటున్న ఉర్ఫీ జావేద్..

చారడేసి కళ్ళు.. పాలుగారే మోము.. ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో కనిపెట్టారా..

Ghani Action Trailer: ‘నా ప్రతి గెలుపుతో నీకు భయం పుట్టేలా చేస్తా’.. అంచనాలను అమాంతం పెంచేసిన గని కొత్త ట్రైలర్‌..