Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చారడేసి కళ్ళు.. పాలుగారే మోము.. ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో కనిపెట్టారా..

సినిమా హీరోయిన్స్ కు ఉండే క్రేజ్ వేరే.. ఒక్కసారి నచ్చారా కుర్రాళ్ళు గుండెల్లో గుడి కట్టేస్తారు. అందాల భామలను కలల రాకుమారిలా ఆరాధిస్తూ ఉంటారు యువత..

చారడేసి కళ్ళు.. పాలుగారే మోము.. ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో కనిపెట్టారా..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 07, 2022 | 11:58 AM

సినిమా హీరోయిన్స్ కు ఉండే క్రేజ్ వేరే.. ఒక్కసారి నచ్చారా కుర్రాళ్ళు గుండెల్లో గుడి కట్టేస్తారు. అందాల భామలను కలల రాకుమారిలా ఆరాధిస్తూ ఉంటారు యువత.. అంతలా హీరోయిన్స్ ను అభిమానిస్తుంటారు కుర్రాళ్ళు. ఇక తమ అభిమాన హీరోయిన్ చిన్ననాటి ఫొటోస్ నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు భారీ కలెక్షన్ ఉంటుంది అందరిదగ్గర.. ఎప్పటికప్పుడు ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ చిన్నదాని ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఓ క్రేజీ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. చారడేసి కళ్ళు.. పాలుగారే మోము..చూడగానే ముద్దొచ్చే ఈ బుజ్జాయి ఇప్పుడు హీరోయిన్ గా దూసుకుపోతుంది. తెలుగు , తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇంతలు ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ముద్దులొలుకుతున్న ఈ బుజ్జాయి ఎవరంటే..

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన హలో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్. కళ్యాణి తండ్రి ప్రియదర్శన్ సౌత్ సినిమాల్లో స్టార్ డైరెక్టర్. తెలుగులో కళ్యాణి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ చాలా మందికి క్రష్ గా మారిపోయింది. హలో సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయిన తర్వాత చిత్రలహరి, రణరంగం చిత్రాల్లో మెరిసింది కళ్యాణి ప్రియదర్శన్. ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళ సినిమాలపై దృష్టిపెట్టింది. చివరిగా కళ్యాణి మలయాళంలో నటించిన ‘హృదయం’ చిత్రంలో ఇతర భాషా ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటించిన ప్రణవ్ మోహన్ లాల్ తో కళ్యాణి ప్రేమలో ఉందని ఓ టాక్ నడుస్తుంది. ప్రణవ్ మోహన్ లాల్ సీనియర్ హీరో మోహన్ లాల్ తనయుడు. కళ్యాణి , ప్రణవ్ చిన్ననాటి నుంచి స్నేహితులు.

Kalyani

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata : మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఫ్యాన్స్ ఖుషి..

Ante Sundaraniki: పంచెకట్టుతో అమెరికాలో చక్కర్లు కొడుతున్న నేచురల్ స్టార్..అంటే సుందరానికి.. నుంచి ఫస్ట్ సింగిల్

Hatya : మరో విభిన్నమైన కథతో రాబోతున్న వర్సటైల్ యాక్టర్.. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ‘హత్య’