Sarkaru Vaari Paata : మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఫ్యాన్స్ ఖుషి..

లెటజ్‌గో అండ్ రాక్‌.. అనే నూతనోత్సాహమే ఎటు చూసినా. చిన్నాపెద్ద అన్ని సినిమాల్లోనూ ఎప్పుడూ లేనంత జోష్ కనిపిస్తోంది. రోజుకో కొత్త సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ..

Sarkaru Vaari Paata : మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఫ్యాన్స్ ఖుషి..
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 06, 2022 | 9:00 PM

నూతనోత్సాహమే ఎటు చూసినా.. చిన్నా..పెద్ద అన్ని సినిమాల్లోనూ ఎప్పుడూ లేనంత జోష్ కనిపిస్తోంది. రోజుకో కొత్త సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ.. ఇండస్ట్రీని టాప్‌గేర్‌లో నడిపిస్తున్నాయి. కట్‌చేస్తే.. రిలీజ్ డేట్ మార్చుకోబోతున్న ఒక భారీ సినిమా అనే హెడ్‌లైన్ వార్త.. నెట్లో హల్‌చల్ చేస్తోందిప్పుడు. బట్.. అదంతా బేస్‌లెస్.. అనేది మేకర్స్ ఇస్తున్న క్లారిటీ. ప్రొడక్షన్‌ వర్క్ స్టార్టవకముందునుంచే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ, ఆగుతూ సాగుతూ వస్తోంది సర్కారువారి పాట(Sarkaru Vaari Paata). ఒకటికి మూడు సార్లు రిలీజ్ డేట్స్ మార్చుకున్నా, ఫైనల్‌గా సేఫెస్ట్ గ్యాప్‌ చూసుకుని మే12ను లాక్ చేసుకుంది. కాకపోతే.. ఆ ఫ్యాన్సీ డేట్ కూడా చేజారిపోతోందా అనేది సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌కొస్తున్న మిలియన్ డాలర్ల డౌట్. మరో నాలుగువారాల్లో సినిమా రిలీజ్ కాబోతోందనగా, ఇప్పుడు సర్కారువారి పాట రిలీజ్ మీద మళ్లీ సందేహాలు పుట్టేశాయి. సినిమా ప్రొడక్షన్ వర్క్ డిలే అవుతోందని, ప్రమోషన్స్‌కి అవసరమైనంత గ్యాప్ దొరకడం లేదని, అందుకే మేకర్స్ ప్లాన్‌బీ వైపు చూస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా క్యాంపెయిన్‌ జరుగుతోంది. బట్.. ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తోంది మైత్రీ సంస్థ.

అప్‌డేట్ల జాతర మొదలుపెట్టి.. ఒక టీజర్‌తో పాటు రెండు పాటల్ని గిఫ్టుగా ఇచ్చేసింది సర్కారువారి టీమ్‌. ఆ పాటలు కూడా పాపులారిటీలో దూసుకుపోతున్నాయి. ఒకేఒక్క పాట మినహా షూట్ పార్ట్ మొత్తం కంప్లీటైందంటున్నారు కెప్టెన్ పరశురామ్. ప్రస్తుతం యాడ్ షూటింగ్స్‌తో బిజీగా వున్న సూపర్‌స్టార్.. వారంరోజుల తర్వాత సర్కారు వారి నెక్స్ట్ పాట కోసం సెట్స్‌ మీదికొస్తారట. ఏప్రిల్ లాస్ట్ వీకెండ్‌లో రిలీజయ్యే ఆచార్య సినిమా రిజల్ట్‌ మీద స్పెషల్‌గా దృష్టి పెట్టబోతోంది మైత్రీ సంస్థ. మెగా మూవీకి బిగ్‌ ఎప్లాజ్ దొరికి.. రెండువారాలకు మించి రన్నింగ్‌ కావల్సి వస్తే.. అప్పుడు ప్లాన్‌బీ విషయం ఆలోచిస్తామని, అంతవరకూ తమ డేట్ మే పన్నెండేనని పూర్తి కాన్ఫిడెన్స్‌తో వుంది టీమ్ ఆఫ్‌ సర్కారువారి పాట సో.. సంక్రాంతినైతే మిస్సయ్యాం.. సమ్మర్‌ సీజన్‌ని మాత్రం వదిలేదే లేదంటోంది ఘట్టమనేని క్యాంప్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akkineni Naga Chaitanya: స్పీడ్ పెంచిన నాగచైతన్య.. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతూ..

Aamna Sharif: డిఫరెంట్ ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న ఆమ్నా షరీఫ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Ram Charan: అయ్యప్ప దీక్షలో అమృత సర్‌లో ల్యాండ్ అయిన రామ్ చరణ్.. నెక్స్ట్ సినిమా షూటింగ్‌తో బిజిబిజీ

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!