AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beast: దళపతి విజయ్‌ సినిమాపై బాలీవుడ్‌ బాద్‌షా ఆసక్తికర వ్యాఖ్యలు.. ఫ్యాన్స్‌ రియాక్షన్‌ ఏంటంటే..

కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) నటిస్తోన్న తాజా చిత్రం బీస్ట్ (Beast). 'డాక్టర్‌' సినిమాతో ఆకట్టుకున్న క్రేజీ డైరెక్టర్‌ నెల్సన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

Beast: దళపతి విజయ్‌ సినిమాపై బాలీవుడ్‌ బాద్‌షా ఆసక్తికర వ్యాఖ్యలు.. ఫ్యాన్స్‌ రియాక్షన్‌ ఏంటంటే..
Shah Rukh Khan
Basha Shek
| Edited By: Anil kumar poka|

Updated on: Apr 07, 2022 | 8:30 AM

Share

కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) నటిస్తోన్న తాజా చిత్రం బీస్ట్ (Beast). ‘డాక్టర్‌’ సినిమాతో ఆకట్టుకున్న క్రేజీ డైరెక్టర్‌ నెల్సన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. విజయ్ సరసన పూజా హెగ్డే స్ర్కీన్‌షేర్‌ చేసుకోనుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల విడుదలైన బీస్ట్ ట్రైలర్‏ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. కాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఈ సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. ‘ప్రస్తుతం నేను డైరెక్టర్ అట్లీతో కూర్చున్నాను. నాలాగే, అతడు కూడా విజయ్‌కి పెద్ద అభిమాని. బీస్ట్ చిత్రబృందానికి నా శుభాకాంక్షలు. ట్రైలర్ అద్భుతంగా ఉంది’’ అని కింగ్ ఖాన్ ట్వీట్ లో రాసుకొచ్చాడు.

కాగా షారుఖ్‌ బీస్ట్ ట్రైలర్‌ను షేర్ చేయడంతో విజయ్ అభిమానులందరూ సంతోషంలో మునిగిపోయారు. ‘థ్యాంక్యూ.. షారుఖ్‌.. ట్రైలర్‌పై మీ రెస్పాన్స్‌ మాకెంతో సంతోషాన్నిచ్చింది’, ‘త్వరలో విజయ్‌తో కలిసి మిమ్మల్ని స్ర్కీన్‌పై చూడాలనుంది’ అని ఒక నెటిజన్ కామెంట్‌ ఇచ్చాడు. కాగా ఇటీవల ఓ బాలీవుడ్‌ హీరో దక్షిణాది సినిమాలపై అక్కసు వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ బాద్‌షా విజయ్‌ సినిమాపై ప్రశంసలు కురిపించడంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. కాగా షారుఖ్‌ ప్రస్తుతం పఠాన్‌ తో పాటు సౌతిండియన్‌ స్టైలిష్‌ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలోనూ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇక బీస్ట్‌ సినిమా విషయానికొస్తే.. వీర రాఘవన్ అనే మాజీ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు విజయ్‌. యాక్షన్‌తో పాటు కామెడీకి సినిమాలో చోటున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ఇక అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం ఉర్రూతలూగిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ మూవీ ఏప్రిల్ 13న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.

Also Read:Covid XE Variant: ముంబైలో బయటపడిన ఒమిక్రాన్‌ ఎక్స్‌ఈ వేరియంట్‌ కాదు.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టీకరణ!

రణబీర్-ఆలియా పర్ఫెక్ట్ జంట అనడానికి ఈ ఫోటోలే నిదర్శనం..

Russia Ukraine War: రష్యాపై అమెరికా మరో ఎత్తుగడ.. UNHRC నుంచి బయటకు పంపేందుకు ప్లాన్..