Covid XE Variant: ముంబైలో బయటపడిన ఒమిక్రాన్‌ ఎక్స్‌ఈ వేరియంట్‌ కాదు.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టీకరణ!

Covid XE Variant: గత రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ప్రస్తుతం అదుపులో ఉంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. కొత్త కొత్త వేరియంట్లతో పుట్టుకొస్తూనే ఉంది...

Covid XE Variant: ముంబైలో బయటపడిన ఒమిక్రాన్‌ ఎక్స్‌ఈ వేరియంట్‌ కాదు.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టీకరణ!
Covid Xe Variant
Follow us

|

Updated on: Apr 06, 2022 | 10:33 PM

Covid XE Variant: గత రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ప్రస్తుతం అదుపులో ఉంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. కొత్త కొత్త వేరియంట్లతో పుట్టుకొస్తూనే ఉంది. ఇక భారత్‌లో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (Omicron) ఎక్స్‌ఈ కేసు నమోదైందని వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ముంబై (Mumbai)లోని పౌర సంస్థ బృహన్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) బుధవారం నగరంలో కోవిడ్‌ వైరస్‌ కొత్త XE వేరియంట్‌ కేసు గుర్తించబడిందని పేర్కొంది. అయితే పేషెంట్‌ నమూనా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ XE వేరియంట్‌ ఉనికిని సూచించడం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు సంబంధిత వర్గాలు సమాచారం అందించాయి. 50 ఏళ్ల మహిళ  వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ తీసుకుందని, ఇప్పటి వరకు ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ పేర్కొంది. అయితే రోగి నమూనాలో ఎక్స్‌ఈ వేరియంట్‌ ఉనికిని ఆరోగ్య మంత్రిత్వశాఖ ఖండించింది. XE వేరియంట్‌గా ఉన్న నమూనాకు సంబంధించి FastQ ఫైల్‌లను INSACOG జన్యుసంబంధ నిపుణులు వివరంగా విశ్లేషించారు. బీఎంసీ తెలిపిన వివరాల ప్రకారం.. వృత్తిరీత్యా కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ఫిబ్రవరి 10న దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. ఇండియాకు చేరుకున్న తర్వాత ఆమెకు పరీక్షలు చేశారు. మార్చి 2న పరీక్షల సమయంలో ఆమె పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత ముంబై సబర్బన్ బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో ఆమెను క్వారంటైన్ చేశారు. అయితే మరుసటి రోజు ఆమె నమూనాలు ప్రతికూలంగా వచ్చాయి. తన తాజా సెరో సర్వే నివేదికలో.. ముంబై రోగుల నుంచి సెరో సర్వే కోసం పంపిన 230 నమూనాలలో 21 మంది ఆసుపత్రిలో చేరినట్లు BMC తెలిపింది. అయితే ఎవరికీ ఆక్సిజన్ సపోర్ట్ లేదా ఇంటెన్సివ్ కేర్ అవసరం లేదని తెలిపింది.

XE వేరియంట్‌ లక్షణాలు..

XE వేరియంట్‌ లక్షణాలు ముఖ్యంగా జ్వరం, గొంతులో గరగర అనిపించడం, దగ్గు, గొంతు నొప్పి, చర్మంపై దద్దుర్లు, జలుబు, రంగు మారడం, జీర్ణకోశ సమస్యలు వంటి లోణాలు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ సోకిన వారిలో ప్రధానంగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే అలసట, కళ్లు తిరగడం వంటివి ప్రారంభంలో కనిపించే కొన్ని లక్షణాలు కూడా ఉంటాయంటున్నారు. అలాగే గుండె దడ, గుండె జబ్బులు, తీవ్రమైన నరాల వ్యాధులు వంటి తీవ్రమైన లక్షణాలు కూడా ఈ వేరియంట్‌ వల్ల కలగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక రుచి, వాసన కోల్పోవడం వంటి అత్యంత సాధారణమైన లక్షణాలు ఈ కొత్త వేరియంట్‌ బారిన పడిన వారిలో చాలా అరుదుగా కనిపిస్తాయని తెలుస్తోంది. ఒమిక్రాన్‌ బీఏ.2 వేరియంట్‌ కన్నా పది శాతంమేర ఇది వ్యాపించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే దీని వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైన ఆధారాలు ఇప్పటి వరకు లేకపోవడం కొంత ఊరటనిస్తుంది.

ఇవి కూడా చదవండి

Coronavirus: కళ్లు పోడిబారిపోతున్నాయా? కరోనా లక్షణం కావచ్చట.. తాజాగా వెలుగులోకి..

ఆక్సిజన్ కొరత కారణంగా కోవిడ్ మరణాలు ఎన్ని..? పార్లమెంటుకు కీలక వివరాలు తెలిపిన కేంద్రం

Latest Articles