ఆక్సిజన్ కొరత కారణంగా కోవిడ్ మరణాలు ఎన్ని..? పార్లమెంటుకు కీలక వివరాలు తెలిపిన కేంద్రం
COVID-19 పాండమిక్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా ప్రాణ నష్టం జరిగినట్లు నిర్థారిస్తూ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం సమాచారం ఇవ్వలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి పవార్ (Union minister of state for health and family welfare Bharati Pawar) మంగళవారం రాజ్యసభకు తెలిపారు.
COVID-19 పాండమిక్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా ప్రాణ నష్టం జరిగినట్లు నిర్థారిస్తూ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం సమాచారం ఇవ్వలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి పవార్ (Union minister of state for health and family welfare Bharati Pawar) మంగళవారం రాజ్యసభకు తెలిపారు. ఆక్సిజన్ కొరత కారణంగా మరణించిన వారి వివరాలను సమర్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం కోరినట్లు ఆమె సభకు తెలియజేశారు. ఈ విషయంపై మొత్తం 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి స్పందన వచ్చినట్లు తెలిపారు. అయితే వాటిలో ఏదీ ఆక్సిజన్ కొరత కారణంగా తమ రాష్ట్రాల్లో మరణాలు నమోదైనట్లు ధృవీకరించలేదని మంత్రి భారతి పవార్ వెల్లడించారు.
ఆక్సిజన్ కొరత కారణంగా సంభవించిన మరణాలపై రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు శక్తిసిన్హ్ గోహిల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. దీనికి సంబంధించి రాష్ట్రాలకు కేంద్రం పలు రిమైండర్లు పంపినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల నుంచి ఏమైనా అదనపు సమాచారం అందితే.. ఆ వివరాలను కేంద్రం పార్లమెంటుకు సమర్పిస్తుందని చెప్పారు.
కాగా కరోనా మహమ్మారి కారణంగా దేశంలో సంభవించిన మొత్తం మరణాల గురించి కేంద్ర మంత్రి భారతి పవార్ రాజ్యసభకు తెలియజేశారు. 2022 ఏప్రిల్ 4 నాటికి దేశంలో COVID-19 కారణంగా మొత్తం 5,21,358 మరణాలు సంభవించినట్లు తెలిపారు. ఆ మేరకు మరణాల సంఖ్యను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్రానికి నివేదించాయని చెప్పారు.
కోవిడ్-19 మరణాలకు రూ.50వేల పరిహారం కోవిడ్ -19 మరణాలకు రూ. 4 లక్షల పరిహారం చెల్లించాలనే తన నిర్ణయాన్ని ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకుందనే దానిపై కాంగ్రెస్ ఎంపీ గోహిల్ మళ్లీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. పేద రోగులకు బీమా కార్యక్రమాల ద్వారా సదుపాయం కల్పించామని భారతి పవార్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఎక్స్‌గ్రేషియా చెల్లింపులను పరిగణనలోకి తీసుకుని.. ఎక్స్‌గ్రేషియాను రూ. 4 లక్షలకు బదులుగా రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.
కోవిడ్-19 సమయంలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కేంద్ర మంత్రి వివరించారు. దేశంలో ఆరోగ్య సదుపాయాల కల్పనకు రూ.64,000 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించిందని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 300 ప్లస్ ల్యాబొరేటరీలు, ఐదు లక్షలకు పైగా ఆక్సిజన్-సపోర్ట్ బెడ్లు, 1.5 లక్షల ఐసియు పడకలు, 4,000 పైగా PSA ప్లాంట్లు, 60 వేల వెంటిలేటర్లు సమకూర్చుకోగా.. అన్ని అత్యవసర సౌకర్యాలు అప్‌గ్రేడ్ చేయబడినట్లు వివరించారు. కొత్త వేరియంట్లు, వైరస్‌లను గుర్తించడం కోసం ఇటీవల బయో-సేఫ్టీ లెవల్ 3 (బిఎస్‌ఎల్) మొబైల్ లాబొరేటరీని కూడా తీసుకొచ్చినట్లు తెలిపారు.
టీకా కార్యక్రమం.. అంతేకాకుండా, దేశంలోని మొత్తం జనాభాకు రెండు డోసుల టీకాలు ఎప్పుడు వేస్తారనే దానిపై తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపి శాంతాను సేన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. దేశ జనాభాలో 97% మందికి మొదటి డోస్ అందించామని భారతి పవార్ తెలిపారు. రెండో డోస్ 85% వరకు అందించినట్లు తెలిపారు. టీకాలు వేయడం ఐచ్ఛికమని, అందరూ కలిసికట్టుగా పనిచేసి వ్యాక్సినేషన్ ప్రచారంలో పాలుపంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ఆమె పేర్కొన్నారు. అయితే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎప్పటి లోగా పూర్తి చేస్తారో కేంద్ర మంత్రి వెల్లడించలేదు.
అటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా దేశంలో కొనసాగుతున్న టీకా డ్రైవ్ వివరాలను మంగళవారంనాడు పార్లమెంటుకు తెలియజేశారు.”మార్చి 30, 2022 నాటికి, జాతీయ కోవిడ్-19 టీకా కార్యక్రమం కింద 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అర్హులైన లబ్ధిదారులకు మొత్తం 167.14 కోట్ల డోసులు (మొత్తం డోస్‌లో 97 శాతం) ఉచితంగా అందించినట్లు” అని ఆయన వెల్లడించారు.
Also Read..
Ram Charan: అయ్యప్ప దీక్షలో అమృత సర్‌లో ల్యాండ్ అయిన రామ్ చరణ్.. నెక్స్ట్ సినిమా షూటింగ్‌తో బిజిబిజీ
Haryana CM: కాన్వాయ్‌లోని నాలుగు వాహనాల ‘వీఐపీ’ నంబర్లను ఉపసంహరించుకున్న హర్యానా సీఎం ఖట్టర్!