Haryana CM: సీఎం కాన్వాయ్‌లోని నాలుగు వాహనాల ‘VIP’ నంబర్ల ఉపసంహరణ.. దీని వెనుక బలమైన కారణం ఉంది..
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్‌లోని నాలుగు వాహనాల 'VIP' రిజిస్ట్రేషన్ నంబర్లను తీసివేయాలని నిర్ణయించుకున్నారు.
Haryana CM Khattar: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్(Mohan Lal Khattar) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్‌లోని నాలుగు వాహనాల ‘VIP‘ రిజిస్ట్రేషన్ నంబర్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ వీఐపీ నెంబర్లను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు వీలుగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. వేలం పాట ద్వారా ఈ వీఐపీ నెంబర్లను ఎవరైనా దక్కించుకోవచ్చు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం చేకూరుతుంది. అధికారిక ప్రకటన ప్రకారం, హర్యానా మోటారు వాహనాల నిబంధనలు, 1993కి సవరణలపై చర్చించడానికి మంగళవారం సాయంత్రం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో తన కాన్వాయ్‌లోని నాలుగు వీఐపీ నెంబర్లను ఉపసంహరించుకున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.
ఈ వేలం ద్వారా నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు ప్రిఫరెన్షియల్ రిజిస్ట్రేషన్ నంబర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి హర్యానా మోటార్ వెహికల్స్ (సవరణ) రూల్స్ 2022కి కేబినెట్ ఆమోదం తెలిపింది. నేటి నుండి అన్ని “విఐపి” వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాయని ముఖ్యమంత్రి ఖట్టర్ తెలిపారు. అలాంటి నంబర్లు ఈ వేలం ద్వారా కేటాయించడం జరుగుతుందన్నారు. దీంతో తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడే సాధారణ ప్రజలలో చాలా మంది ప్రస్తుతం 179 రాష్ట్ర ప్రభుత్వ వాహనాలకు కేటాయించిన ఈ VIP నంబర్లను కొనుగోలు చేయగలుగుతారని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఈ వేలం ద్వారా రూ.18 కోట్ల ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.
मुख्यमंत्री श्री @mlkhattar ने सादगी भरा जीवन जीने का एक और उदाहरण पेश करते हुए सीएम कार काफिले में शामिल चार गाड़ियों के 0001 नम्बर छोड़ने की घोषणा कर दी। मुख्यमंत्री ने यह घोषणा मंत्रिमंडल की बैठक में हरियाणा मोटर वाहन नियम 1993 में संशोधन पर आए एक एजेंडे पर चर्चा के दौरान की। pic.twitter.com/RCl7INMK7S
— CMO Haryana (@cmohry) April 5, 2022
Read Also…. PM Modi: బీజేపీ కార్యకర్త దేశ కలలకు ప్రతినిధి.. నిర్ధిష్టమైన విధానంతో దేశ ప్రగతి సాధ్యంః ప్రధాని మోదీ