AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CUET 2022 exam date: కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం..ఇలా అప్లై చేసుకోండి..

కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET 2022) రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) బుధవారం (ఏప్రిల్ 6) నుంచి ప్రారంభించింది..

CUET 2022 exam date: కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం..ఇలా అప్లై చేసుకోండి..
Cuet 2022
Srilakshmi C
|

Updated on: Apr 06, 2022 | 11:09 AM

Share

CUET 2022 Registration last date: కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET 2022) రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) బుధవారం (ఏప్రిల్ 6) నుంచి ప్రారంభించింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్cuet.samarth.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో మే 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా, ఇంగ్లీషుతో సహా మొత్తం 13 భాషల్లో ఈ పరీక్ష జరుగుతుంది. సీయూఈటీ పరీక్ష మూడు విభాగాలుగా ఉంటుంది. సెక్షన్ 1ఏ లో 13 భాషలు, సెక్షన్ 1బీ లో 19 భాషలుంటాయి. సెక్షన్ IIలో 27 domain-specific subjects ఉంటాయి. ఇకసెక్షన్ IIIలో జనరల్ ఎగ్జామినేషన్‌ ఉంటుంది.

కాగా 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగావున్న వివిధ సెంట్రల్ యూనివర్శిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి గానూ కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ను ఎన్టీఏ నిర్వహిస్తోంది. అంతేకాకుండా 2022-23 విద్యా సంవత్సరానికి గానూ యూనివర్సిటీ అడ్మిషన్ విధానాన్ని ఢిల్లీ యూనివర్సిటీ మంగళవారం (ఏప్రిల్ 5) విడుదల చేసింది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2022లో సాధించిన మార్కుల ఆధారంగానే అర్హతను నిర్ణయిస్తామని వైస్ ఛాన్సలర్ యోగేష్ సింగ్ (Yogesh Singh) ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్ధులు 12వ తరగతిలో చదివిన సబ్జెక్టుల నుంచి మాత్రమే సీయూఈటీ టెస్ట్‌ రాయవల్సి ఉంటుందని, ఆయా సబ్జెక్టుల కాంబినేషన్‌ ఆధారంగానే మెరిట్‌ లిస్టు తయారీ చేయబడుతుందని వీసీ యోగేష్ సింగ్ స్పష్టం చేశారు.

CUET 2022కు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి..

  • ముందుగా అధికారిక సైట్‌cuet.samarth.ac.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్ పేజ్‌లో కనిపించే CUET 2022 లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • లాగిన్ వివరాలు నమోదు చేసి, సబ్‌మిట్ చేయాలి.
  • వెంటనే అప్లికేషన్‌ విండో ఓపెన్‌ అవుతుంది.
  • అప్లికేషన్‌ను పూరించి, రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి.
  • అన్ని వివరాలను చెక్‌ చేసుకుని, చివరిగా సబ్‌మిట్‌ చెయ్యాలి.
  • అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్‌ఓట్‌ తీసుకోవాలి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Also Read:

NIT Delhi Recruitment 2022: నిట్‌ ఢిల్లీలో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...