NIT Delhi Recruitment 2022: నిట్ ఢిల్లీలో టీచింగ్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT).. ప్రొఫెసర్ పోస్టుల (Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..
NIT Delhi Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT).. ప్రొఫెసర్ పోస్టుల (Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 6
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్ పోస్టులు
విభాగాలు: కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్.
పే స్కేల్: ఏడాదికి రూ.8,78,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే టీచింగ్, రీసెర్చ్ విభాగాల్లో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: డైరెక్టర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) ఢిల్లీ, జీటీ కర్నాల్ రోడ్, ఢిల్లీ-110036.
దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ. 1000 ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు: రూ. 500
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 29, 2022.
హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేదీ: మే 9, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: