Governor Delhi Tour: ప్రధాని నరేంద్రమోడీని కలిసిన గవర్నర్ తమిళిసై.. మరికాసేపట్లో అమిత్ షాతో భేటీ!

ఢిల్లీ వెళ్లిన తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై ఆమె రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Governor Delhi Tour: ప్రధాని నరేంద్రమోడీని కలిసిన గవర్నర్ తమిళిసై.. మరికాసేపట్లో అమిత్ షాతో భేటీ!
Governor Meet Modi
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 06, 2022 | 12:18 PM

Governor Meets PM Modi: ఢిల్లీ వెళ్లిన తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundararajan) ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi)తో సమావేశమయ్యారు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై ఆమె రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానికి తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులను వివరించినట్లు సమాచారం. మంగళవారం నాడు రాత్రి తమిళిపై న్యూఢిల్లీకి వచ్చారు. ప్రధానితో సమావేశం తర్వాత గవర్నర్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో కూడా సమావేశమవుతారని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిపై సౌందర రాజన్‌కు ఈ మధ్య కాలంలో అగాధం పెరిగిపోతుంది. ఈ తరుణంలో ప్రధానితో తమిళిసై భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై కూడా ప్రధానికి తమిళిసై వివరించినట్లు సమాచారం.

తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా వచ్చాక గవర్నర్, గవర్నమెంట్‌ మధ్య సఖ్యత ఉండేది. అయితే ఈ మధ్య వచ్చిన గ్యాప్‌ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గవర్నర్ అధికారిక కార్యక్రమాలకు CM హాజరుకాకపోవడం గ్యాప్‌ను స్పష్టం చేస్తోంది. మరో వైపు గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టడం చర్చకు దారితీసింది. రాష్ట్రంలో తాజా పరిణామాలు, ప్రొటోకాల్ వివాదాలను గవర్నర్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, హూజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పేరుకు సిఫార్సు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కౌశిక్ రెడ్డిపై బీజేపీ సహా ఇతర పార్టీలు కూడా ఫిర్యాదు చేశాయి. అయితే కౌశిక్ రెడ్డి పేరుతో తెలంగాణ ప్రభుత్వం పంపిన ఫైలును గవర్నర్ తన వద్దే పెట్టుకొంది. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ప్రతిపాదించింది. గవర్నర్ కోటాలో మధుసూధనాచారికి టీఆర్ఎస్ సర్కార్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.

అలాగే, ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు కూడా కేసీఆర్ సహా మంత్రులు ఎవరూ హాజరు కాలేదు. అటు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. అయితే తొలుత బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తనకు సమాచారం అందించిందని , ఆ తర్వాత పొరపాటున ఆ సమాచారం పంపారని ప్రభుత్వం నుండి సమాచారం వచ్చిందని తమిళిసై ప్రకటించింది. టెక్నికల్ అంశాన్ని సాకుగా చూపి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ముగించేసింది టీఆర్ఎస్ సర్కార్. గవర్నర్ ప్రసంగం లేకండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడాన్ని కూడా విపక్షాలు తప్పుబట్టాయి.

మరోవైపు, రాజ్ భవన్ లో ఉగాది సంబరాలను గవర్నర్ నిర్వహించారు. ఈ వేడుకలకు ఆహ్వానం పంపించినప్పటికీ.. కేసీఆర్ సహా మంత్రులు ఎవరూ కూడా పాల్గొనలేదు. తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారలమ్మ జాతరలోనూ ప్రోటోకాల్ పాటించలేదు. అటు యాదాద్రి ఆలయ పునః ప్రాంభం సమయంలోనూ గవర్నర్‌కు ఛేదు అనుభవం ఎదురైంది. ఈ సందర్భాల నేపథ్యంలో ఉగాది రోజు గవర్నర్ ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు కూడా. తాను ఎవరికీ తల వంచబోనని తమిళిసై స్పష్టం చేశారు. కేసీఆర్ సహా మంత్రులకు ఆహ్వానం పంపిన విషయాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Read Also…  Haryana CM: కాన్వాయ్‌లోని నాలుగు వాహనాల ‘వీఐపీ’ నంబర్లను ఉపసంహరించుకున్న హర్యానా సీఎం ఖట్టర్!