ఈ సమస్యలకు దివ్య ఔషధం కాకరకాయ.. ఎలా తీసుకోవాలంటే 

07 January 2025

Pic credit-Pexel

TV9 Telugu

కాక‌ర‌కాయ డ‌యాబెటిస్‌ను అదుపు చేయ‌డంలో అద్భుతంగా పనిచేస్తుంది.  వీటిని తిన‌డం ఇష్టం లేక‌పోతే క‌నీసం జ్యూస్ రూపంలో తాగినా మంచిది.

కాక‌ర‌కాయ‌ల్లో చ‌రాంతిన్ అనే స‌హ‌జ‌సిద్ధ‌మైన స్టెరాయిడ్ ఉంటుంది. ఇది ర‌క్తంలో చ‌క్కెర లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది.

కాక‌ర‌కాయ‌లోని ఓలినాలిక్ యాసిడ్ గ్లూకోసైట్స్ ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ ను తగ్గిస్తాయి. క్లోమ‌గ్రంథి ఇన్సులిన్‌ను స‌రిగ్గా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి

షుగర్ వ్యాధి ఉన్నవారు రోజూ కాకరని తినడం వలన ఎంతో మేలు. కాక‌ర‌కాయ జ్యూస్‌ను రోజూ 30 ఎంఎల్ మోతాదులో తాగినా చాలు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపు చేయ‌వచ్చని నిపుణులు చెప్పారు. 

రక్తంలో ఉన్న అధిక షుగర్ లెవెల్ ను తగ్గించడమే కాదు.. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలని కూడా త‌గ్గించ‌డంలోనూ మంచి సహాయకారి.

అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్యకు చక్కటి పరిష్కారం కాక‌ర‌కాయ‌. శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. 

కాకర‌కాయ‌లో బి కాంప్లెక్స్ విట‌మిన్ ఉంది. ఈ విట‌మిన్ల లోపంతో బాధ‌ప‌డుతున్నవారు రోజూ కాక‌ర‌కాయ జ్యూస్‌ను తాగితే ఫ‌లితం ఉంటుంది. 

కాకర జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల కిడ్నీల్లోని వ్యర్ధాలు బ‌య‌ట‌కు వెళ్తాయి.  కిడ్నీల్లో ఉండే స్టోన్స్ క‌రిగిపోతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.