AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL-MTNL విలీనం వాయిదా.. కారణం ఏమిటో పార్లమెంట్‌లో తెలిపిన కేంద్ర మంత్రి..!

BSNL-MTNL: ఆర్థిక కారణాల వల్ల ప్రభుత్వరంగ టెలికాం కంపెనీలు BSNL, MTNL ( BSNL-MTNL విలీనం ) విలీనాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం పార్లమెంట్‌లో..

BSNL-MTNL విలీనం వాయిదా.. కారణం ఏమిటో పార్లమెంట్‌లో తెలిపిన కేంద్ర మంత్రి..!
Subhash Goud
|

Updated on: Apr 07, 2022 | 5:48 AM

Share

BSNL-MTNL: ఆర్థిక కారణాల వల్ల ప్రభుత్వరంగ టెలికాం కంపెనీలు BSNL, MTNL ( BSNL-MTNL విలీనం ) విలీనాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఈ విలీన ప్రతిపాదనను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు సమాచార ప్రసారాల సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ (Devusinh Chauhan) రాజ్యసభ (Rajya Sabha)లో బుధవారం లిఖితపూర్వకంగా సమాధానంలో ఇచ్చారు. అయితే భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్ (BBNL), భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌ల విలీనానికి సంబంధించిన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరోవైపు, దేశీయంగా 4G ఆధారిత టెలికాం నెట్‌వర్క్‌ను స్థాపించడానికి BSNL దేశవ్యాప్తంగా 1.12 లక్షల టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో తెలిపారు.

MTNL, BSNL విలీనానికి సంబంధించి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) రికవరీ ప్లాన్‌ను ప్రభుత్వం అక్టోబర్ 23, 2019న ఆమోదించిందని సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి రాతపూర్వక సమాధానంలో తెలిపారు. అధిక రుణభారంతో సహా ఆర్థిక కారణాల వల్ల BSNLతో MTNL విలీనం వాయిదా పడింది. BSNL ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ PK పుర్వార్, MTNLకి కూడా నాయకత్వం వహిస్తున్నారు, SPV ద్వారా MTNL, దాని ఆస్తులకు సంబంధించిన రూ. 26,500 కోట్లకు పైగా రుణ భారాన్ని తొలగించడాన్ని DoT పరిగణించాలని పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. దీని తర్వాత ఎంటీఎన్‌ఎల్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం చేయాలని ఆయన సూచించారు. ఈ రుణం ఉన్న కంపెనీలను ఎట్టి పరిస్థితుల్లోనూ రికవరీ చేయలేమని MTNL యొక్క CMD ప్యానెల్‌కు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Bank Account Aadhaar Link: మీ ఆధార్‌ ఏయే బ్యాంకు అకౌంట్లకు అనుసంధానం అయ్యిందో తెలుసుకోవడం ఎలా..?

Meesho: దూసుకుపోతున్న మీషో.. త్వరలో మరో సదుపాయం.. ప్రయత్నాలు ముమ్మరం..!