Meesho: దూసుకుపోతున్న మీషో.. త్వరలో మరో సదుపాయం.. ప్రయత్నాలు ముమ్మరం..!

Meesho: భారతదేశంలో ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇ-కామర్స్ కంపెనీలు తమ భవిష్యత్తులో భారతీయ మార్కెట్‌ను కైవసం..

Meesho: దూసుకుపోతున్న మీషో.. త్వరలో మరో సదుపాయం.. ప్రయత్నాలు ముమ్మరం..!
Meesho
Follow us
Subhash Goud

| Edited By: Phani CH

Updated on: Apr 06, 2022 | 9:28 AM

Meesho: భారతదేశంలో ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇ-కామర్స్ కంపెనీలు తమ భవిష్యత్తులో భారతీయ మార్కెట్‌ను కైవసం చేసుకోవాలని కోరుకోవడానికి ఇదే కారణం. ఇప్పుడు మీషో కూడా రేంజ్‌లో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. మీరు ఇప్పుడు మీషో యాప్‌ (Meesho App)లో కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేయవచ్చు. కంపెనీ అతి త్వరలో తన యాప్‌లో కిరాణా వస్తువుల ఆర్డర్స్‌ చేసుకునే సదుపాయాన్ని తీసుకువస్తోంది. ఆన్‌లైన్ కస్టమర్ల కోసం ఒకే షాపింగ్ డెస్టినేషన్‌గా కంపెనీ స్థాపించాలని యోచిస్తోంది. టాటా, అంబానీ, వాల్‌మార్ట్, అమెజాన్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈ రేసులో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం మీషో యాప్‌లో ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, హోమ్ కేర్ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు.

మే మొదటి వారంలోగా కిరాణా వ్యాపారం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, తర్వాత అది ఫార్మిసో నుండి మీషో సూపర్‌స్టోర్‌కి రీబ్రాండ్ చేయబడుతుందని కంపెనీ భావిస్తోంది. మీషో వ్యవస్థాపకుడు, CEO విదిత్ అత్రే మాట్లాడుతూ.. టైర్-II నగరాల నుండి పెద్ద సంఖ్యలో కస్టమర్లు ఆన్‌లైన్ షాపింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఆన్‌లైన్ కిరాణాకు డిమాండ్ స్థిరంగా ఉంటుంది. ఈ కిరాణ వస్తువుల డెలివరీ సదుపాయాన్ని కర్ణాటక నుండి ప్రయోగాత్మక పరీక్ష ప్రారంభించాము. ఆరు రాష్ట్రాల్లో పైలట్ టెస్టింగ్ చాలా విజయవంతమైంది. రెడ్‌సీర్ కన్సల్టింగ్ నివేదిక ప్రకారం.. భారతదేశ ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్ పరిమాణం ప్రస్తుతం $50 బిలియన్లకు దగ్గరగా ఉంది. ఇది 2025 నాటికి $115 బిలియన్లకు, 2030 నాటికి $350 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. ఇక మీషో యాప్‌లో 500 ఉత్పత్తుల శ్రేణి అందుబాటులోఉంది. ఈ సూపర్‌స్టోర్ నుండి పండ్లు, కూరగాయలు, కిరాణా, గృహ సంరక్షణ, ప్యాక్ చేసిన ఆహారాలను ఆర్డర్ చేయవచ్చు.

ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో సూపర్‌స్టోర్ సౌకర్యం..

మీషో ఆన్‌లైన్ కిరాణాకి సంబంధించి కర్ణాటక నుండి పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. 9 నెలల్లోనే దేశంలోని ఆరు రాష్ట్రాలకు తన వ్యాపారాన్ని విస్తరించింది. ఈ రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్. పైలట్ ప్రాజెక్ట్ చాలా విజయవంతమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని 12 రాష్ట్రాల్లో మీషో సూపర్ స్టోర్ సేవలను ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

Online Shopping: మీరు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా..? ఈ విషయాలను గుర్తుంచుకోవడం మంచిది..!

WhatsApp: యూజర్లకు షాకిచ్చిన వాట్సాప్‌.. 14.26 లక్షల భారతీయ ఖాతాలపై నిషేధం.. ఎందుకంటే..!