AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka CM: బెంగళూరును హైదరాబాద్‌తో పోల్చడం హాస్యాస్పదం.. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక సీఎం

బెంగళూరును హైదరాబాద్‌తో పోల్చాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు చేసిన వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కొట్టిపారేశారు.

Karnataka CM: బెంగళూరును హైదరాబాద్‌తో పోల్చడం హాస్యాస్పదం.. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక సీఎం
Karnataka Cm On Ktr
Balaraju Goud
|

Updated on: Apr 06, 2022 | 7:43 AM

Share

Karnataka CM on KTR: బెంగళూరును హైదరాబాద్‌తో పోల్చాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు చేసిన వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కొట్టిపారేశారు. బెంగళూరులోని ఒక ఐటీ పారిశ్రామికవేత్తలను హైదరాబాద్‌కు రావాలని కోరుతూ కేటీఆర్ ఇటీవల చేసిన ట్వీట్‌పై ఆయన స్పందిస్తూ, అక్కడ మెరుగైన భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచం నలుమూల ఉన్న ఐటీ కంపెనీలు బెంగళూరు వైపే చూస్తున్నాయని సీఎం బొమ్మై స్పష్టం చేశారు. అన్ని విధాలుగా హైదరాబాద్ కంటే ముందే బెంగళూరు నగరం అభివృద్ధి అని ఆయన గుర్తు చేశారు.

”ఇది పూర్తిగా హాస్యాస్పదంగా ఉంది. .భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు బెంగళూరుకు వస్తున్నారు. బెంగళూరులో అత్యధిక స్టార్టప్‌ కంపెనీలు ఉన్నాయి. అత్యధిక యునికార్న్‌లు బెంగళూరులో ఉన్నాయి. బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం జరుగుతోంది” అని బొమ్మై చెప్పారు. దేశంలో అత్యధిక ఎఫ్‌డీఐలు, 40 శాతానికి పైగా ఎఫ్‌డీఐలు, వరుసగా గత మూడేండ్లలో కర్ణాటక మొదటి స్థానంలో ఉందని సీఎం చెప్పారు. కర్ణాటకను తెలంగాణతో లేదా బెంగళూరును హైదరాబాద్‌తో పోల్చడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మార్చి 31న, బెంగళూరు మౌలిక సదుపాయాలపై ఫిర్యాదు చేస్తూ సీరియల్ వ్యవస్థాపకుడు రవీష్ నరేష్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ, తెలంగాణ మంత్రి కేటీఆర్.. “మీ బ్యాగ్‌లు సర్దుకుని హైదరాబాద్‌కు వచ్చేయండి” అని అడిగారు. “…మా దగ్గరు మీకు కావల్సిన మెరుగైన భౌతిక మౌలిక సదుపాయాలు & సమానంగా మంచి సామాజిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. మా విమానాశ్రయం అత్యుత్తమమైనది. మరీ ముఖ్యంగా మా ప్రభుత్వ దృష్టి 3 i మంత్రంపై ఉంది. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాం’’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

అంతకు ముందు బెంగళూరు రోడ్లు, మౌలిక సదుపాయాల గురించి ఫిర్యాదు చేస్తూ, ఖాతాబుక్ వ్యవస్థాపకుడు సీఈవో అయిన నరేష్ ఒక ట్వీట్‌లో ఇలా అన్నారు, “HSR/Koramagala (భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ)లోని స్టార్టప్‌లు ఇప్పటికే బిలియన్ల డాలర్ల పన్నులను చెల్లిస్తున్నాయి. ఇంకా మాకు అధ్వాన్నమైన రోడ్లు, దాదాపు రోజువారీ విద్యుత్ కోతలు, నాణ్యత లేని నీటి సరఫరా, ఉపయోగించలేని ఫుట్ పాత్‌లు ఉన్నాయి. అనేక గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ కంటే మెరుగైన ప్రాథమిక మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నాయి” అలాగే పీక్ ట్రాఫిక్‌లో సమీపంలోని విమానాశ్రయం మూడు గంటల సమయం పడుతోంది’’ అని ఆయన ఫిర్యాదు చేశారు.

మరో ట్వీట్‌కు ప్రతిస్పందనగా, కేటీఆర్ సోమవారం ట్వీట్ చేస్తూ, “బెంగళూరులో విచిత్రమైన, విచారకరమైన పరిస్థితి ఉంది!! ఆపై బెంగళూరు నుండి కొంతమంది బిజెపి రాజకీయ నాయకులు వచ్చి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఎలా నడపాలి అనే దానిపై మాకు ఉపన్యాసాలు ఇస్తున్నారు.కర్ణాటకలో జరుగుతున్న ఘటనలు భారతదేశంలోని మనందరికీ అవమానకరం. పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంగా మన ఖ్యాతిని నాశనం చేస్తుంది. అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.

Read Also…  Investments: రూ. 1000 పెట్టుబడితో లక్షలు సంపాదించోచ్చు..! అందుకు ఇలా సేవ్ చేయండి..