Fuel Price Hikes: భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి
Fuel Price Hikes: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. గత నాలుగైదు నెలలుగా స్థిరంగా ఉన్న చమురు ధరలు.. గత 13 రోజుల నుంచి ఎగబాకుతున్నాయి...
Fuel Price Hikes: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. గత నాలుగైదు నెలలుగా స్థిరంగా ఉన్న చమురు ధరలు.. గత 13 రోజుల నుంచి ఎగబాకుతున్నాయి. ఉక్రెయిన్-రష్యా (Ukraine-Russia) యుద్దాల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంలో ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇప్పుడు ధరలు మండిపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరుగుదలతో దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. పార్లమెంట్‌లో కూడా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చింది.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్‌పూరి (Hardeep Singh Puri) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో ఇంధన ధరలు చాలా తక్కువగా పెరిగాయని అన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో ఇంధన ధరలు 1/10 వంతుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక 2021 ఏప్రిల్ నుంచి మార్చి 2022 మధ్య కాలంలో పెట్రోల్ ధరలు ఫ్రాన్స్‌లో 50 శాతం, అమెరికాలో 51 శాతం, కెనడాలో 52 శాతం, జర్మనీలో 55 శాతం, యుకేలో 55 శాతం, స్పెయిన్‌లో 58 శాతం చొప్పున పెరిగాయని, భారత్‌లో మాత్రం కేవలం 5 శాతం మాత్రమే ధరలు పెరిగాయని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో చాలా తక్కువ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: