Coronavirus: కళ్లు పోడిబారిపోతున్నాయా? కరోనా లక్షణం కావచ్చట.. తాజాగా వెలుగులోకి..

Coronavirus: కరోనా  ప్రాథమిక లక్షణాలలో దగ్గు, జలుబు, జ్వరం మాత్రమే ఉన్నాయి. అయిత  ఇప్పుడు కళ్లు మసకబారడం, కళ్లు పొడిబారడం కూడా  ఈ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన సమస్యలుగా మారుతున్నాయి

Coronavirus: కళ్లు పోడిబారిపోతున్నాయా? కరోనా లక్షణం కావచ్చట.. తాజాగా వెలుగులోకి..
Dry Eyes
Follow us
Basha Shek

|

Updated on: Apr 06, 2022 | 6:56 PM

Coronavirus: కరోనా  ప్రాథమిక లక్షణాలలో దగ్గు, జలుబు, జ్వరం మాత్రమే ఉన్నాయి. అయిత  ఇప్పుడు కళ్లు మసకబారడం, కళ్లు పొడిబారడం కూడా  ఈ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన సమస్యలుగా మారుతున్నాయి. ఇటీవల, హాంకాంగ్‌లోని చైనీస్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో కరోనాతో బాధపడుతున్న వారిలో 20 శాతం మందికి పొడి కళ్లు (Dry Eyes) ఉన్నాయని తెలిపారు. అధ్యయనంలో భాగంగా కరోనా నుంచి కోలుకున్న 228 మంది రోగులను పరిశోధకులు పరిశీలించారు. ఈ రోగుల హెల్త్‌ రికార్డులను 109 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తులతో పోల్చారు. కరోనా సోకిన ప్రతి 5 మందిలో ఒకరికి డ్రై ఐ డిసీజ్ లక్షణాలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. దీంతో పాటు కళ్లు అస్పష్టంగా మారడం, కాంతిని చూడలేకపోవడం, కళ్ల వాపు తదితర సమస్యలు కూడా ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది. కళ్లకు తగినంత లూబ్రికేషన్, విశ్రాంతి లభించనప్పుడు కళ్లు బాగా అలసిపోతాయి. ఫలితంగా కన్నీళ్లు ఆరిపోవడం, కళ్లలో మంట, వాపు, నొప్పి, ఉబ్బిపోవడం వంటి సమస్యలు వస్తాయి. కాగా కరోనా వైరస్‌, కళ్లకు సంబంధించి గతంలో కూడా పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా 2021లో క‌రోనాకు క‌ళ్లతో సంబంధం ఏంట‌ని ప‌రిశోధించారు. ప్రతి 10 మంది కరోనా రోగులలో ఒకరు కంటికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. చాలామందికి కళ్లు పొడిబారిన సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు.

కరోనా కళ్లపై ఎలా దాడి చేస్తుంది?

కరోనా కారణంగా కళ్లు తేమను కోల్పోతాయి. దృష్టి సరిగా ఉండదు. వెలుగును సరిగా చూడలేరు. కాగా కంటి వ్యాధికి కారణం కరోనా, ACE2 ఎంజైమ్ మధ్య లింక్ అని పరిశోధకులు చెబుతున్నారు. ACE2 ఎంజైమ్ సహాయంతో మాత్రమే కరోనా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని తరువాత వైరస్ మన కళ్లలో ఉండే కణాలకు సోకుతుంది. ఇదే కళ్లలో పలు సమస్యలకు కారణమవుతుందట. కాగా కరోనా వల్ల వచ్చే కళ్ల పొడిబారిన లక్షణాలు కొన్ని వారాల్లో మెరుగవుతాయని పరిశోధకులు తెలిపారు. అయితే సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వైద్యులను సంప్రదించాలని వారు సూచిస్తున్నారు. దీంతో పాటు కొన్ని సహజ చిట్కాలను పాటించడం ద్వారా పొడికళ్లను నివారించవచ్చు. అవేంటంటే..

కళ్లను కాపాడుకోండిలా..

*గాలి, పొగ ఎక్కువగా కళ్లకు తగలకుండా జాగ్రత్తగా ఉండండి.

*నీరు బాగా తాగాలి.

*గాలిలో తేమను నిలుపుకోవడానికి హ్యూమిడిఫైయర్ ఉపయోగించండి.

* వైద్యులను సంప్రదించిన తర్వాతే కంటి వ్యాయామాలు చేయండి.

Also Read: Geomagnetic Storm: సూర్యునిలో భారీ పేలుడు.. ఉపగ్రహాలకు ముంచుకొచ్చిన ముప్పు.. మన పరిస్థితి ఏమిటి?

Google Maps: వాహనాదారులకు గూగుల్ మ్యాప్స్ ఉపశమనం.. టోల్ లేని ప్రత్యామ్నాయ మార్గాలతో సరికొత్త ఫీచర్

Ananya Panday: అలాంటి పాత్రలు చేస్తే హీరోని ఒకలా.. హీరోయిన్‌ను మరోలా ట్రీట్ చేస్తారంటున్న ‘లైగర్’ భామ..