Geomagnetic Storm: సూర్యునిలో భారీ పేలుడు.. ఉపగ్రహాలకు ముంచుకొచ్చిన ముప్పు.. మన పరిస్థితి ఏమిటి?

శాస్త్రవేత్తల ప్రకారం, సూర్యునిపై మొదటి పేలుడు ఏప్రిల్ 3 న, రెండవ పేలుడు ఏప్రిల్ 4 న జరిగింది. వాటి రేడియేషన్ భూమికి కూడా చేరుతుంది. ఇదే జరిగితే ఏప్రిల్ 7వ తేదీ అంటే గురువారం..

Geomagnetic Storm: సూర్యునిలో భారీ పేలుడు.. ఉపగ్రహాలకు ముంచుకొచ్చిన ముప్పు.. మన పరిస్థితి ఏమిటి?
Geomagnetic Storm
Follow us

|

Updated on: Apr 06, 2022 | 6:51 PM

సూర్యుడిపై విపరీతమైన పేలుడు సంభవించడం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. ఏప్రిల్ 3న సూర్యునిపై సంభవించిన విపరీతమైన పేలుడు కారణంగా బలమైన సౌర తుఫాను పుట్టింది. బలమైన అయస్కాంత ప్రభావంతో కూడిన ఈ సౌర తుఫాను ఈరోజు లేదా రేపు (గురువారం) భూమిని తాకవచ్చని, దీని కారణంగా భూ వాతావరణంలో మార్పుతోపాటు ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు. ముఖ్యంగా భూ కక్ష్యలో కదులుతున్న ఉపగ్రహాలన్నీ ఆగిపోయే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంటున్నారు. స్పేస్ వెదర్ నివేదిక ప్రకారం, వాస్తవానికి, సూర్యునిపై చాలా లోతైన అగ్ని లోయలో పేలుడు సంభవించింది. దీని కారణంగా సౌర ప్లాస్మా జ్వాలలు వేగంగా బయటకు వచ్చి ప్రభావితం చేస్తాయి.

‘వ్యాలీ ఆఫ్ ఫైర్’ నుంచి వెలువడుతున్న ప్లాస్మా..

ప్లాస్మా ఎక్కడ నుంచి బయటకు వస్తుందో ఆ సూర్యుని బిందువుకు శాస్త్రవేత్తలు ‘కాన్యన్ ఆఫ్ ఫైర్’ లేదా ‘వాలీ ఆఫ్ ఫైర్’ అని పేరు పెట్టారు. స్పేస్ వెదర్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, ఇది కనీసం 20 వేల కిలోమీటర్ల లోతు, 10 రెట్లు ఎక్కువ ఉంటుందని తేల్చారు.

బ్రిటన్ వాతావరణ సూచన మెట్ ఆఫీస్ ప్రకారం, వ్యాలీ ఆఫ్ ఫైర్ సూర్యుని దక్షిణ మధ్య భాగంలో ఉంది. ఉపగ్రహాలు, గ్రౌండ్ టెలిస్కోప్‌లు రెండూ పేలుళ్లతో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

భూ అయస్కాంత తుఫాను భూమిని తాకే ఛాన్స్..

శాస్త్రవేత్తల ప్రకారం, సూర్యునిపై మొదటి పేలుడు ఏప్రిల్ 3 న, రెండవ పేలుడు ఏప్రిల్ 4 న జరిగింది. వాటి రేడియేషన్ భూమికి కూడా చేరుతుంది. ఇదే జరిగితే ఏప్రిల్ 7వ తేదీ అంటే గురువారం సూర్యుడి నుంచి వచ్చే భూ అయస్కాంత తుఫాను భూమిపై ప్రభావం చూపుతుంది. ఇది భూమి దిగువ కక్ష్యలో కదులుతున్న ఉపగ్రహాలను ప్రభావితం చేస్తుంది. దీంతో వాటి కనెక్షన్ కోల్పోవచ్చు. భూ అయస్కాంత తుఫాను అనేది భూమి అయస్కాంత క్షేత్రానికి ఇబ్బందులు కలిగించే చాన్స్ ఉంది. ఇది భూమి చుట్టూ ఉన్న వాతావరణం శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది.

NOAA కూడా..

ఇలాంటి విపత్తు సమయంలో నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA)తోపాటు స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ (SWPC) కూడా హెచ్చరికలు జారీ చేసింది. NOAA తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ సంఘటన కారణంగా, మైనర్ జియోమాగ్నెటిక్ స్టార్మ్‌ను ఏప్రిల్ 6 లేదా 7న చూడవచ్చని పేర్కొంది.

ఇంతకు ముందు కూడా..

ఈ సంవత్సరం ప్రారంభంలో, ఎలోన్ మస్క్ అంతరిక్ష సంస్థకు చెందిన 40 ఉపగ్రహాలు జియోమాగ్నెటిక్ తుఫానుల బారిన పడ్డాయి. సూర్యుడి నుంచి వచ్చే పేలుడుకు సంబంధించిన రేడియేషన్ ఈ 40 ఉపగ్రహాలను అంతరిక్షంలోనే ధ్వంసం చేసింది.

Also Read: Google Maps: వాహనాదారులకు గూగుల్ మ్యాప్స్ ఉపశమనం.. టోల్ లేని ప్రత్యామ్నాయ మార్గాలతో సరికొత్త ఫీచర్

Deaf and Blind Baby: ఎంతో కాలం తర్వాత మొదటిసారిగా తల్లి స్వరాన్ని విన్న ఈ పాప ఎక్స్‌ప్రెషన్ చూస్తే.. మీ కళ్లు చెమ్మగిల్లుతాయి!